కరివేపాకుతో మొటిమలకు ఇలా చెక్ పెట్టండి ?

Purushottham Vinay
పసుపు ఇంకా కరివేపాకు ఫేస్ ప్యాక్ తో మొటిమల సమస్యను ఈజీగా పోగొట్టొచ్చు.. పసుపు ఇంకా కరివేపాకు రెండింటిలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని లక్షణాలతో సమృద్ధిగా ఉన్న ఈ రెండింటినీ ఓ ప్యాక్‌గా తయారు చేయడం ద్వారా ఇక మీరు ముఖంపై మొటిమలను ఈజీగా తొలగించవచ్చు.పసుపు ఇంకా అలాగే కరివేపాకుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి.ఇక ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి, మీరు 6-7 కరివేపాకు ఇంకా 4-5 టీస్పూన్ల పచ్చి పసుపును తీసుకోవాలి. అందులో కొద్దిగా నీటిని మిక్స్ చేసి తరువాత మిక్సీ పట్టండి.లేదంటే ఇక పాత పద్దతిలో రోటిలో రుబ్బండి. ఇక ఆ తర్తవాత ఈ పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇక ఈ పేస్ట్‌ని మీ మొత్తం ముఖం ఇంకా అలాగే మెడకు అప్లై చేయండి.ఇక ఈ పేస్ట్‌ను ఒక 10 నిమిషాలు పాటు అలాగే ఉంచి.. ఆపై మీ ముఖాన్ని చల్లటి మంచినీటితో కడగాలి. ఈ ప్యాక్ అప్లై వేసుకున్న వెంటనే ఎలాంటి మేకప్ కూడా వేసుకోకండి.

ఇక ఫేస్ ప్యాక్ కడిగిన తర్వాత.. మీ ముఖంపై తేలికపాటి మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెను రాయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖ జుట్టును తగ్గించడంలో ఇంకా అలాగే ముఖంపై పేరుకుపోయిన నూనెను తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది.ఇక జుట్టు పెరుగుదలను పెంచడానికి కరివేపాకు ప్యాక్ సహాయపడుతుంది.ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, విటమిన్ సి, బి, ఎ ఇంకా అలాగే విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇక ఇది కరివేపాకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది శిరోజాలను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. మూలాల నుండి మీ జుట్టును బాగా బలపరుస్తుంది. మీ జుట్టు పెరుగుదలకు కొబ్బరి నూనెతో కరివేపాకును వాడవచ్చు.ఇక కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి తరువాత గ్యాస్ మీద కాసేపు వేడి చేయండి. ఇక మీరు నూనెను వడకట్టి మీ జుట్టుకు పట్టించి బాగా సున్నితంగా మసాజ్ అనేది చేయాలి. ఇది జుట్టులో నూనెను గంటసేపు ఉంచి ఇక ఆపై షాంపూతో తలస్నానం చేయండి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ జుట్టు బాగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: