ముఖంపై నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా ?

VAMSI
సాధారణంగా ఏ వయసులో ఉన్న వారైనా సరే అందంగా కనిపించాలని అనుకుంటారు. వీలైనంత వరకు అందంగా తయారవ్వాలని ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటుంటారు. అయితే చాలా మంది ఎంత అందంగా ఉన్నప్పటికీ ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతుంటారు. ఆ నల్ల మచ్చలు వారి ముఖంలో కాంతిని కోల్పోయేలా చేసి అంద వికారంగా కనిపిస్తుంటుంది. చాలా మందికి వయసు పైబడే కొద్ది ముఖంపై నల్ల మచ్చలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి నొప్పిని, బాదని అయితే కలిగించవు. కానీ ముఖంపై ఈ నల్లటి మచ్చల వలన వారు మానసికంగా చాలా కుంగిపోతుంటారు.
ఎలా ఈ నల్లమచ్చలను పోగొట్టి అందంగా కనిపించాలి అని ఆలోచిస్తుంటారు. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీములు, లోషన్లు వాడటం, ఆయుర్వేదిక్ మెడిసిన్ అని ఇలా చాలానే ఉపయోగిస్తుంటారు. కొందరికి ఫలితం ఉంటుంది కానీ కొందరికి మాత్రం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ముఖంపై ఈ నల్ల మచ్చలు అనేవి అస్సలు పోవు. అయితే అలాంటి వారు ఈ చిట్కా పాటించినట్లైతే తప్పక ప్రతిఫలం ఉంటుందని నల్ల మచ్చలు మెల్లగా మీ ముఖంపై నుండి మాయమౌతాయని చెబుతున్నారు కొందరు సౌందర్య శాస్త్ర నిపుణులు. ఇంతకీ ఆ చిట్కా ఇపుడు తెలుసుకుందాం.
నారింజ తొక్కలను ఎండబెట్టి మెత్తని పౌడర్ లా చేసుకోవాలి, అలాగే వీటికి సమానంగా రోజా రేకులను ఎండబెట్టి వాటిని కూడా మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి.   ఈ రెండింటినీ ఒక్కో స్పూను చొప్పున వేసి, అర స్పూను శనగపిండిని కూడా వేయాలి, ఇందులో కాస్త పాల మీగడను కానీ లేదా పెరుగును కానీ కలిపి ముఖానికి పట్టించాలి. ముఖంపై సర్కిల్ మోషన్ లో బాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు గంట ఆగి చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. మరీ ఎక్కువ సార్లు చేయకూడదు. వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన ముఖం పై ఉన్న నల్లటి మచ్చలు మెల్లగా పోయి మీ ముఖం ఎంతో కాంతి వంతంగా తయారవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: