ఈ ఆహారం తింటే మీకు బట్టతల వచ్చే ఛాన్స్ అనేదే ఉండదు..

Purushottham Vinay
ఇక ఈ రోజుల్లో చాలా మంది కూడా బట్టతల సమస్యతో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎంతలా అంటే కొంతమందికి మంచి జాబ్ అనేది వున్నా కాని బట్టతల కారణంగా పెళ్లి అవ్వడం అనేది కూడా చాలా కష్టంగా వుంది. ఇక బట్టతల రాకుండా జుట్టు బాగా పెరగాలంటే ఖచ్చితంగా ఈ ఆహారం తీసుకోవాలి.ఇక కోడి గుడ్లు ప్రోటీన్ అలాగే బయోటిన్ వంటి పోషకాలు కలిగిన అతిపెద్ద మూలం. ఈ రెండు పోషకాలు కూడా జుట్టు పెరుగుదలకు చాలా అవసరం. ఇక మన జుట్టు కుదుళ్లను బాగా బలోపేతం చేయడానికి ప్రోటీన్ అనేది బాగా సహాయపడుతుంది, అయితే బయోటిన్ అనేది పెరిగే జుట్టు కోసం ప్రోటీన్ కెరాటిన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది మన జుట్టు పెరుగుదలను బాగా పెంచుతుంది.కాబట్టి ఈ పోషకాల లోపం సాధారణంగా జుట్టు రాలడానికి బాగా కారణమవుతుంది. కాబట్టి రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు అనేవి తప్పనిసరిగా తీసుకోవడం చాలా మంచిది.

ఇక సాల్మన్ ఒక మంచి కొవ్వు చేప.ఈ చేపలో ఒమేగా 3 కొవ్వులు, ప్రోటీన్ ఇంకా విటమిన్ డి అనేవి ఉన్నాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు అలాగే జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడే మంచి పోషకాలు. ఇక సాల్మన్ తీసుకోవడం ద్వారా జుట్టు పెరుగుదల అనేది ప్రోత్సహించబడుతుంది.అలాగే క్యారెట్లు మన కంటి చూపుకి మాత్రమే కాదు, మన జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్యారెట్‌లోని బీటా కెరోటిన్ జుట్టు ఆరోగ్యంగా ఉండి పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే జుట్టు కుదుళ్లను కూడా బాగా బలోపేతం చేస్తుంది.ఇంకా అలాగే జుట్టు రాలడాన్ని కూడా క్యారెట్ నివారిస్తుంది. అలాగే క్యారెట్‌లో విటమిన్ ఎ, సి, కె, బి కాంప్లెక్స్ ఇంకా పొటాషియం, ఫాస్పరస్ అలాగే ఫైబర్ వంటి పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఈ మొత్తం అన్ని కూడా శారీరక ఆరోగ్యానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.అలాగే పచ్చని ఆకు కూరలు కూడా శారీరక ఆరోగ్యానికి చాలా మంచివి.ఈ ఆకు కూరలో జుట్టు సంరక్షణ రహస్యం కూడా ఉంది.ఇక పాలకూర అనేది వివిధ పోషకాలతో కూడిన గొప్ప మూలం. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ బి, సి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇంకా ఐరన్ ఉంటాయి. పాలకూరను సలాడ్లు, స్మూతీలు ఇంకా పాల తిస్టిల్‌లకు మనం జోడించవచ్చును.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: