హీరో మోటో కార్ప్ : మళ్ళీ ధరలు పెంచేసిందిగా!

Purushottham Vinay
ద్విచక్రవాహన కొనుగోలుదారులకి ఇది నిజంగా పెద్ద బ్యాడ్‌న్యూస్‌ అని చెప్పాలి. ఎందుకంటే ప్రముఖ టూ వీలర్ మోటార్ కంపెనీ హీరో మోటోకార్ప్‌ జూలై 1 వ తేదీ నుంచి ధరలని పెంచుతుంది.ఇక హీరో మోటోకార్ప్ ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. పెరుగుతున్న వస్తువుల ధరల కారణంగా ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగింది. దీని కారణంగా ద్విచక్ర వాహనాల తయారీ ఖర్చు కూడా చాలా బాగా పెరిగింది. ఇక అందుకే కంపెనీ తన మోటార్ సైకిళ్లు ఇంకా అలాగే స్కూటర్ల ధరలను రూ. 3,000 పెంచాలని నిర్ణయించడం జరిగింది.జూలై 1, 2022 నుంచి కూడా కంపెనీ మోటార్‌సైకిల్ స్కూటర్ల ధరలను పెంచబోతున్నట్లు హీరో మోటోకార్ప్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. ఇక అలాగే ఇన్‌పుట్ ధర పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని కూడా కంపెనీ పేర్కొంది. అలాగే కమోడిటీ ధరల పెరుగుదల కారణంగా ధరను పెంచే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే మోటారు సైకిళ్లు ఇంకా అలాగే స్కూటర్ల మోడళ్లను బట్టి ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుందని తెలిపింది.


ఇక హీరో మోటోకార్ప్ గత ఏడాది కాలంలో కనుక చూసినట్లయితే నాలుగోసారి స్కూటర్ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతోంది. గతంలో కూడా జూలై 1, 2021న రూ.3,000, సెప్టెంబర్ 30న రూ.3,000, జనవరి 1, 2022 నుంచి రూ.2,000, ఇక ఇప్పుడు రూ.3,000 పెంచాలని నిర్ణయించారు. దీంతో సామాన్యులకు ద్విచక్రవాహనాలు కొనాలంటే తడిసి మోపడవుతుంది.ఇక ఇలాగే కొనసాగితే హీరో కంపెనీ సేల్స్ తగ్గిపోవడం ఖాయం లాగా కనిపిస్తుంది.ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా హీరో బైక్స్ ని జనాలు ఆదరిస్తున్నారు. ఇలా ధరలు పెంచేస్తే ఇక జనాలకు కొనాలానే ఆసక్తి ఖచ్చితంగా పోతుంది.కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకొని హీరో కంపెనీ ధరల విషయంలో నిర్ణయం అనేది తీసుకుంటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: