మహీంద్రా స్కార్పియో-ఎన్: విడుదలకు ముహుర్తం ఖరారు!

Purushottham Vinay
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం ఈ కొత్త ఎస్‌యూవీని జూన్ 27 వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త స్కార్పియో-ఎన్ కోసం అధికారికంగా బుకింగ్‌లు ఓపెన్ చేయనప్పటికీ ఇంకా డీలర్‌షిప్ స్థాయిలో కొంతమంది డీలర్లు ఈ కారు కోసం అనధికారికంగా బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ ఎస్‌యూవీ విడుదలైన రోజు నుండే కొత్త 2022 స్కార్పియో-ఎన్ కోసం టెస్ట్ డ్రైవ్‌లు అనేవి కూడా ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.ఇక మహీంద్రా ఎక్స్‌యూవీ700 విషయంలో చేసినట్లుగా కాకుండా, కంపెనీ తమ కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ విషయంలో లాంచ్ తేది, బుకింగ్ తేదీ ఇంకా షోరూమ్ డిస్‌ప్లే తేదీ ఇంకా అలాగే టెస్ట్ డ్రైవ్ తేదీని ఒకే రోజుగా ఉంచాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త తరం 2022 స్కార్పియో-ఎన్ మార్కెట్లో విడుదల కావడానికి ముందే భారీ హైప్‌ను సృష్టిస్తోంది.


కంపెనీ ఈ కారు గురించిన వివరాలు ఒక్కొక్కటి కూడా టీజర్‌లో వెల్లడి చేస్తూ వస్తోంది. ఇప్పటికే కొత్త తరం స్కార్పియో ఎక్స్టీరియర్ ఇంకా అలాగే ఇంటీరియర్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడి చేసింది.కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ కార్ దాని పాత మోడల్ కంటే కాస్తంత పెద్దదిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ డిజైన్ కూడా పాత మోడల్‌తో పోలిస్తే చాలా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ఫ్రంట్ లుక్ కూడా పూర్తిగా మారిపోయింది. ముందువైపు సన్నటి ఎల్ఈడి ట్విన్-పాడ్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్ ఇంకా అలాగే కొత్త ఫ్రంట్ బంపర్‌లతో ఇది మునుపటి కన్నా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్రంట్ గ్రిల్‌పై క్రోమ్ స్లాట్లు, సిల్వర్ రూఫ్ రైల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, కొత్త డిజైన్ తో కూడిన డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఇంకా అలాగే కొత్త మహీంద్రా బ్రాండ్ లోగోతో ఇది చాలా ప్రీమియంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: