రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 : సూపర్ లుక్.. బుల్లెట్ కంటే చౌక!

Purushottham Vinay
ఇక పర్ఫర్మేన్స్ బైక్‌లను తయారు చేసే చెన్నైకి చెందిన వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ ఇంకా కొత్త హిమాలయన్ 450 అండ్ 650cc బైక్‌లతో సహా కొత్త రేంజ్ బైక్స్ పై పని చేస్తోంది.అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌లను విడుదల చేయడానికి ముందే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హంటర్ 350ని విడుదల చేస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కూడా గుర్తించబడింది. ఈసారి బైక్ కు సంబంధించిన స్పష్టమైన ఫోటోలు, స్పెసిఫికేషన్‌లు ఇంకా అలాగే లాంచ్ వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.ఇక ఈ కొత్త హంటర్ 350 జూన్ 2022లో లాంచ్ అవుతుందని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ బైక్ యొక్క సేల్ ఈ ఏడాది జూలై నెలలో మొదలవుతుందని ఒక కొత్త మీడియా నివేదిక పేర్కొంది. అయితే బుకింగ్‌లు జూలై నెల మొదట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కొత్త హంటర్ 350 డెలివరీలు ఆగస్టు 2022 నాటికి ప్రారంభమవుతాయి.అలాగే హంటర్ 350 ఇండియన్ మార్కెట్లో అత్యంత చౌకైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అని కంపెనీ చౌకైన బైక్ రిపోర్ట్ పేర్కొంది.


ఈ కొత్త బైక్ వచ్చే ఏడాది విడుదల కానున్న నెక్స్ట్ జనరేషన్ బుల్లెట్ 350 కంటే కింద ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర వచ్చేసి దాదాపు రూ.1.30 లక్షల నుంచి రూ.1.40 లక్షలుగా ఉంటుందని అంచనా.ఇక ఈ కొత్త RE హంటర్ 350కి J1C1 అనే సంకేతనామం ఉంది. ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ పెడిగ్రీతో కూడిన ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ నుండి డిజైన్ స్ఫూర్తితో కూడిన మంచి ఆధునిక రెట్రో రోడ్‌స్టర్. బైక్ లో పొడవైన, సింగిల్-పీస్ సీటు, టియర్‌డ్రాప్-ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్ ఇంకా అలాగే గుండ్రని ఆకారపు హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్-ల్యాంప్‌లు, టర్న్ సిగ్నల్‌లు ఇంకా అలాగే మిర్రర్స్ కూడా ఉన్నాయి. బైక్ సీటు ఎత్తు కూడా తక్కువగా ఉంటుంది, ఇంకా అలాగే తక్కువ ఎత్తు ఉన్న రైడర్‌లకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఈ బైక్ క్లాసిక్ అండ్ మీటోర్ 350 కంటే కూడా తేలికగా ఉంటుంది, ఇక దీని బరువు వచ్చేసి 190-195 కిలోలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: