ఇండియన్ మార్కెట్లో సరికొత్త Yamaha బైక్!

Purushottham Vinay
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) ఇండియన్ మార్కెట్ లో అమ్ముతున్న ఎమ్‌టి-15 (MT-15) లో ఓ సరికొత్త మోడల్ ను మార్కెట్లో విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. యమహా తమ ఎమ్‌టి-15 బైక్‌లో ఓ కొత్త వెర్షన్ 2.0 (టూ పాయింట్ ఓ)ని ఈ నెల 11 వ తేదీన (ఏప్రిల్ 11, 2002వ తేదీన) మార్కెట్లో విడుదల చేయనుంది.ఇక ఈ యమహా ఎమ్‌టి-15 వి2.0 బైక్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఇది కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్ యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 (Yamaha YZF-R15) స్పోర్ట్స్ బైక్ కి నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ వెర్షన్ గా ఉంటుంది. కంపెనీ ఇప్పుడు ఇందులో కాస్మెటిక్ ఇంకా అలాగే మెకానికల్ అప్‌డేట్‌లతో కూడిన కొత్త 2022 మోడల్ ను వచ్చే వారం మార్కెట్లో రిలీజ్ చేయబోతోంది.యమహా ఎమ్‌టి-15 బైక్ ను కంపెనీ మొదటిసారిగా డిసెంబర్ 2018లో థాయిలాండ్‌ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఆ తర్వాత కొన్ని నెలలకు, 2019లో యమహా ఈ బైక్ ను భారతదేశంలో కూడా రిలీజ్ చేసింది.


ఇక యమహా ఆర్-15 తో పోల్చుకుంటే, ఎమ్‌టి-15 ఫెయిరింగ్ ఇంకా అలాగే కొన్ని ప్రీమియం భాగాలను కోల్పోవడం వలన ఇది చాలా తేలికైన ఇంకా చురుకైన నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్‌గా ఉంటుంది.ఇక యమహా ఎమ్‌టి-15 బైక్ లో నిటారుగా ఉన్న రైడింగ్ పొజిషన్, అద్భుతమైన పవర్-టు-వెయిట్ రేషియో ఇంకా అలాగే అతి చురుకైన హ్యాండ్లింగ్ వంటి ఫీచర్లతో ఈ మోటార్‌సైకిల్ ఓ మంచి ఫన్ టూ రైడ్ బైక్ గా ఉంటుంది. అయితే, అమ్మకాల పరంగా, మునుపటి ఎమ్‌టి-15 కంపెనీ ఆశించిన పనితీరును పెర్ఫార్మ్ చేయలేదు. దీంతో యమహా, ఈ మోటార్‌ బైక్ కు కొత్త ప్రారంభాన్ని అందించేందుకు ఇప్పుడు దీనిని వెర్షన్ 2.0 పేరుతో కొన్ని మేజర్ అప్‌డేట్స్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది.ఇక కొత్త 2022 మోడల్ యమహా ఎమ్‌టి-15 వెర్షన్ 2.0 (2022 yamaha mt-15 V2.0) బైక్ ను కంపెనీ తమ లేటెస్ట్ యమహా ఆర్15 వెర్షన్ 4.0 (Yamaha R15 V4.0) ని ఆధారంగా చేసుకొని తయారు చేయబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: