మహీంద్రా నుంచి సూపర్ కార్.. త్వరలో లాంచ్!

Purushottham Vinay
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ అయిన ఇండియన్ కార్ల కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra), ఇటీవలే తన సరికొత్త ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV700) ఎస్‌యూవీ కార్ ని మంచి అప్డేటెడ్ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది.న్యూ జనరేషన్ థార్ అలాగే సరికొత్త ఎక్స్‌యూవీ700 మోడళ్ల లాంచ్ తో వరుస విజయాలను దక్కించుకున్న మహీంద్రా ఇక ఇప్పుడు మరో అతిపెద్ద లాంచ్ కు రెడీ అవుతుంది.మహీంద్రా అండ్ మహీంద్రా ప్రవేశపెట్టబోయే తమ తర్వాతి కారు, గతంలో కంపెనీ అమ్మిన కార్ల కన్నా కూడా ఎంతో భిన్నంగా ఇంకా అలాగే ఫూచరిస్టిక్ గా కూడా ఉండబోతోంది. ఇక ఈ కంపెనీ విడుదల చేసిన టీజర్ ని కనుక చూస్తే, ఈ విషయం పూర్తిగా స్పష్టమవుతోంది.మహీంద్రా ఈసారి పెట్రోల్ ఇంకా అలాగే డీజిల్ కార్లనే కాకుండా, ఓ అధునాతన ఎలక్ట్రిక్ కారును కూడా విడుదల చేయబోతోంది.ఇక మహీంద్రా ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని జులై నెలలో అధికారికంగా ఆవిష్కరించనుంది. ప్రస్తుతానికి కంపెనీ ఇంకా ఈ కారుకి ఎలాంటి పేరును డిసైడ్ చెయ్యలేదు.


మహీంద్రా కంపెనీ ప్రస్తుతం మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లపై పని చేస్తోంది. మహీంద్రా కంపెనీ వీటికి బోర్న్ ఎలక్ట్రిక్ రేంజ్ (Born Eelectric Range) అని పేరు పెట్టింది. ఈ మూడు మోడళ్లలో మహీంద్రా నుండి ముందుగా ఓ ఎస్‌యూవీ మోడల్ అనేది మార్కెట్లోకి వస్తుందట. ఇక ప్రస్తుతం, దేశంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, కంపెనీ ముందుగా ఈ విభాగంలో తమ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.ఇక ప్రస్తుతం ఇండియాలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాప్ పొజిషన్ లో ఉంది. మరోవైపు మారుతి సుజుకి కూడా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేస్తుంది. అలాగే, హ్యుందాయ్ ఇంకా ఎమ్‌జి మోటార్ వంటి కంపెనీలు కూడా ఈ విభాగంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ లను విక్రయిస్తున్నాయి.ఇక ఈ నేపథ్యంలో, మహీంద్రా కంపెనీ ఈ రేసులో వెనుకబడి ఉండాలనుకోవట్లేదు. అందుకే మహీంద్రా కొత్త ప్లాట్‌ఫారమ్‌పై ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: