మార్కెట్లో విడుదలైన ఫోర్స్ గుర్ఖ.. ధర, వివరాలు..

Purushottham Vinay
ఇండియాలో వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న ఫోర్స్ మోటార్స్ ఫోర్స్ గుర్ఖ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలవ్వడం జరిగింది. ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త SUV కార్ ధర వచ్చేసి రూ. 13.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా వుంది.
ఇక ఫోర్స్ కంపెనీ ఈ కొత్త ఆఫ్ రోడర్ కార్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించడం జరిగింది. ఇక ఈ కొత్త ఫోర్స్ గుర్ఖ కార్ ని కొనుగోలు చేయదలచిన వారు రూ. 25,000 ధర విలువ గల టోకెన్ తో బుక్ చేసుకోవచ్చు. ఇక దీని డెలివరీలు కూడా రానున్న దసరా పండుగ రోజు నుంచి ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపడం జరిగింది.
ఇక ఈ కొత్త ఫోర్స్ గుర్ఖ కార్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో మనకు అందుబాటులో ఉంటుంది.
ఇక అవి:
1.రెడ్
2.గ్రీన్
3.వైట్
4.ఆరంజ్
5.గ్రే (బూడిద రంగు)
ఇక ఈ కొత్త ఫోర్స్ గుర్ఖ కార్ యొక్క డిజైన్ విషయానికి వస్తే .. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక అంతేగాక ఇది చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ ఇంకా అలాగే మంచి ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటుంది. ఇది విశాలమైన ఇంకా అలాగే పొడవైన బాడీని కలిగి ఉంటుంది. ఇక అంతేగాక ఇది కఠినమైన రోడ్డులో కూడా ప్రయాణించడానికి ఎంతో అనుకూలంగా ఉండటం కోసం సి-ఇన్-సి చాసిస్ ఇంకా అలాగే 4 చక్రాలపై కొత్త కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా కలిగి ఉంటుంది.ఇక ఈ కొత్త ఫోర్స్ గుర్ఖ కార్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 4,116 మిమీ పొడవు, 1,812 మిమీ వెడల్పు ఇంకా 2,075 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. ఇక అదే విధంగా ఈ కార్ 2,400 మిమీ పొడవైన వీల్‌బేస్‌ను కూడా పొందుతుంది. 210 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఈ సూపర్ కార్ పొందుతుంది.
ఇక ఈ కొత్త ఫోర్స్ గుర్ఖ అప్డేటెడ్ రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ అలాగే అప్డేటెడ్ ఫ్రంట్ గ్రిల్ ఇంకా ఫ్రంట్ గ్రిల్ మీద గుర్ఖ అని వ్రాయబడిన అక్షరాలు ఇంకా ఎల్ఈడీ స్టాప్ లాంప్‌తో పాటు నిలువుగా ఉంచిన టెయిల్ ల్యాంప్‌లు ఈ కార్ లో మనం చూడవచ్చు. ఇక ఇవన్నీ కూడా ఈ కొత్త SUV కార్ కి మంచి దూకుడు రూపాన్ని కూడా అందిస్తాయి. ఇక అంతే కాకుండా ఈ కార్ లోని స్పోర్టి యాక్సెంట్స్ బ్లాక్ ఓఆర్‌విఎమ్‌ల వరకు ఎక్స్టెండ్ అవుతాయి.ఫోర్స్ గుర్ఖ కార్ యొక్క సైడ్ ఫ్రొఫైల్ లో 4x4x4 ఉండటం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: