ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో టాటా మోటార్స్ న్యూ రికార్డ్..

Purushottham Vinay
ఇక ఇండియన్ మార్కెట్లో బాగా ఫేమస్ అయిన వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధి చెందిన టాటా మోటార్స్  భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక టాటా మోటార్స్ సాధారణ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లను కూడా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసి చాలా మంచి ప్రజాదరణ పొందుతోంది. ఇక టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రస్తుతం టాటా నెక్సన్ ఈవి ఇంకా టాటా టిగోర్ ఈవి అనే రెండు మంచి మోడల్స్ ఉన్నాయి.ఇండియన్ మార్కెట్లో టాటా కంపెనీ టాటా నెక్సన్ ఈవి ఇంకా టాటా టిగోర్ ఈవి లను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటికి 10,000 వాహనాలను (ఎలక్ట్రిక్ వాహనాలను) అమ్మగలిగింది. ఇక ఈ విషయం అనేది ఈ ప్రస్తుత కాలంలో టాటా కంపెనీ సాధించిన ఒక గొప్ప విజయం అనే చెప్పాలి. ఎందుకంటే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సరైన మౌలిక సదుపాయాలు అంటే ఛార్జింగ్ స్టేషన్స్ లేని టైం లో ఇన్ని ఎలక్ట్రిక్ కార్లను అమ్మడం అనేది చాలా అరుదైన విషయమే.

ఇక ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన శకం అనేది ప్రారంభమవ్వడం జరిగింది.ఇక ఈ నేపథ్యంలో భాగంగానే చాలా టాప్ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఈ టైం లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్స్ అన్ని కూడా అవసరమైనన్ని అందుబాటులో ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి చాలా కంపెనీలు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని బాగా పెంచడం కోసం ఎక్కువా సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా రెడీ చేస్తున్నాయి.ఇక మౌలిక సదుపాయాలు అంతగా లేని ఈ రోజుల్లో ఇన్ని ఎలక్ట్రిక్ కార్లను అమ్మగలిగిన టాటా మోటార్స్ ఇకపై మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మగలుగుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. టాటా మోటార్స్ ఫ్యూచర్ ప్లాన్ ను కూడా ఇప్పుడే రెడీ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: