MG Astor బుకింగ్ డేట్.. దాని వివరాలు..

Purushottham Vinay
చైనా కార్ల తయారీ కంపెనీ MG Motor (ఎమ్‌జి మోటార్) నుంచి భారతీయ మార్కెట్లో విడుదలకు రెడీ అవుతున్న సరికొత్త మోడల్ వచ్చేసి MG Astor (ఎమ్‌జి ఆస్టర్). ఇక ఈ MG Astor కార్ సరికొత్త ఫీచర్స్ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ని కలిగి ఉంటుంది. ఇక ఈ కంపెనీ దీనికి సంబంధించిన చాలా సమాచారాన్ని ఇప్పటికే అందించడం జరిగింది.అయితే ఇప్పుడు కంపెనీ యొక్క బుకింగ్ తేదీని ప్రకటించడం జరిగింది.MG Motor కంపెనీ  MG Astor బుకింగ్స్ అధికారికంగా 2021 అక్టోబర్ నెల 07 వ తేదీ నుంచి ప్రారంభించబడే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఈ కొత్త మోడల్ ఆఫీషియల్ రిలీజ్ డేట్ ని అయితే ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ఈ కార్ ధరని కూడా ఇంకా వెల్లడించలేదు. ఈ కార్ ధరని కంపెనీ త్వరలో వెల్లడిస్తుంది. అయితే కార్ బుకింగ్ మొత్తం కూడా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కార్ డెలివరీలు ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఇది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.ఇక MG Astor కంపెనీ అనేది హెక్టర్ కింద ఉంచబడుతుంది. అయితే ఇది కంపెనీకి సంబంధించిన ZS EV ఎలక్ట్రిక్ వెర్షన్ పైన ఆధారపడి ఉంటుంది.
ఇక కంపెనీ ఈ కొత్త SUV కార్ ని దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని షోరూమ్‌లలో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక ఆసక్తి కలిగిన కస్టమర్లు వెంటనే షోరూమ్‌లను సందర్శించి ఈ కార్ ని చెక్ చేయవచ్చు.ఇక MG Astor కార్ అద్భుతమైన డిజైన్ ని కలిగి ఉంటుంది.ఇక ఈ SUV కార్ ముందు భాగంలో వచ్చేసి కంపెనీ గ్రిల్ ఇంకా ఎల్ఈడీ హెడ్‌లైట్ అందించడం జరిగింది. దానికి కూడా ఫాగ్ లైట్స్ అనేవి ఉన్నాయి, ఇక దీనికి అంతే కాకుండా బంపర్‌పై లైన్స్ అనేవి కూడా ఇవ్వబడ్డాయి. ఇక ఈ కార్ లో 5-స్పోక్ అల్లాయ్ వీల్‌ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.ఇక MG Astor కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే..ఇది డ్యూయల్ టోన్‌లో ఉంటుంది. అలాగే డాష్‌బోర్డ్ మధ్యలో 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇక అలాగే ఈ కార్ లో ఆపిల్ కార్‌ప్లే అలాగే ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: