BMW X5 xDrive SportX Plus ఎస్‌యువి విడుదల.. ధర, వివరాలు..

Purushottham Vinay
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ bmw, ఇండియా మార్కెట్లో కొత్త bmw X5 xDrive SportX Plus SUV ని విడుదల చేయడం జరిగింది. bmw X5 xDrive SportX Plus రెండు వేరియంట్లలో విడుదలవ్వడం జరిగింది. అవి XDrive40i ఇంకా xDrive30d వేరియంట్లు. ఇక ఈ రెండు వేరియంట్లు కూడా సరికొత్త ఫీచర్స్ ఇంకా పరికరాలను కలిగి ఉంటాయి.ఇండియా మార్కెట్లో విడుదలైన ఈ bmw X5 xDrive SportX Plus ధరల విషయానికి వస్తే.. xDrive40i ధర వచ్చేసి రూ. 77.90 లక్షలు కాగా అలాగే xDrive30d వేరియంట్ ధర వచ్చేసి రూ. 79.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) వుంది.ఇక కంపెనీ ఈ కార్ బుకింగ్స్ ప్రారంభించడం జరిగింది.కాబట్టి కొనుగోలుదారులు వెంటనే బుక్ చేసుకోవచ్చు.ఇక bmw ఇండియా, ఈ రెండు మోడళ్లను కూడా భారతదేశంలోనే స్థానికంగా తయారు చేయనున్నట్లు తెలిపడం జరిగింది. ఇక కంపెనీ ఈ కొత్త మోడల్స్ డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతుందని భావించడం జరుగుతుంది.ఇక bmw ఇండియా X5 xDrive SportX Plus ఎంతో అద్భుతమైన డిజైన్ ని కలిగి ఉంటుంది.

ఇక ఈ కార్ లో రివర్స్ అసిస్టెంట్ అలాగే bmw లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్ వంటి అనేక సరి కొత్త టెక్నాలజీలతో వస్తున్నాయి.అలాగే మొత్తం మూడు మెటాలిక్ పెయింట్ స్కీమ్‌లతో X5 xDrive SportX Plus SUV ని కంపెనీ మార్కెట్లో విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ ఇంకా బ్లాక్ సఫైర్ అనే కలర్స్ ఉన్నాయి.ఇక ఈ కొత్త bmw X5 xDrive SportX Plus SUV కార్ కాన్బెర్రా బీజ్ కలర్ ఇంకా బ్లాక్‌ సెన్సటెక్ అపోల్స్ట్రే తో ప్రామాణికంగా పొందడం జరిగింది. ఇక డిజైన్ పరంగా, కొత్త X5 xDrive SportX Plus పెద్ద సింగిల్-పీస్ హెక్సా గోనల్ కిడ్నీ షేప్ గ్రిల్‌ను పొందడం జరిగింది. ఇక ఇవి కాకుండా ఈ SUV కార్ లో LED హెడ్‌లైట్లు, LED ఫాగ్ ల్యాంప్‌లు ఇంకా అలాగే 3D LED వ్రాపారౌండ్ టెయిల్‌లైట్లు ఉపయోగించబడ్డాయి. ఇక ఈ కార్ లో కనిపించే రూఫ్ రైల్స్ శాటిన్-ఫినిష్డ్ అల్యూమినియంలో వస్తాయి.ఇక కొత్త bmw X5 xDrive30d ఇంజిన్ విషయానికి వస్తే..ఈ కార్ లోని 3.0-లీటర్ ఇంకా ట్విన్‌పవర్ టర్బో ఇన్-లైన్ డీజిల్ ఇంజిన్ 265 బిహెచ్‌పి పవర్ ఇంకా 620 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ డీజిల్ ఇంజిన్ కేవలం 6.5 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని సాధిస్తుందని కంపెనీ పేర్కొనడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: