హాట్ వీల్స్ నుంచి కిర్రాకెక్కించే ఇ- బైక్.. ధర, వివరాలు..

Purushottham Vinay
ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజు రోజుకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుందనే చెప్పాలి. ప్రస్తుతం సైకిల్స్ నుంచి విమానాల దాకా దాదాపు అన్ని కూడా ఎలక్ట్రిక్ వాహనాలే తయారవుతున్నాయి. ఇక ఈ తరుణంలో ప్రముఖ Hot Wheels (హాట్ వీల్స్) కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించడం జరిగింది.హాట్ వీల్స్ కంపెనీ ఇప్పుడు మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొచ్చింది.ఇక దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకోండి.హాట్ వీల్స్ కంపెనీ అనేది ఓ ఫేమస్ ఆటోమొబైల్ బొమ్మల తయారీ కంపెనీ అనే విషయం అందరికి తెలిసిందే.కానీ ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకే దీని కోసం ఈ కంపెనీ అమెరికన్ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీదారు Super73 తో టై అప్ అవ్వడం జరిగింది. ఇక ఫ్లాగ్‌షిప్ మోడల్ Super73-RX రియర్ లైఫ్ మోడల్ చేయడానికి కంపెనీ ఈ భాగస్వామ్యాన్ని చెయ్యడం జరిగింది.Hot Wheels X Super73-RX ప్రస్తుతం కేవలం 24 యూనిట్ల ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ మాత్రమే తయారుచేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 24 యూనిట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపడం జరిగింది.కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధరను US $ 5,000 గా నిర్ణయించడం జరిగింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం ధర వచ్చేసి సుమారు రూ. 3.71 లక్షలు ఉంటుందన్నమాట.

ఇక ఈ కొత్త హాట్ వీల్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్టాండర్డ్ మోడల్ లాగానే ఉంటుంది. కానీ మంచి డిజైన్ ఇంకా అలాగే ఇది మంచి స్టైల్ లో ఉంటుంది. ఇది చూడగానే ఎంతో ఆకర్షించే విధంగా ఉంటుంది. హాట్ వీల్స్ X Super73-RX మోటార్ సైకిల్ కొత్త లైవరీని పొందడం జరిగింది. ఇక ఇది బ్లూ ఇంకా ఆరెంజ్ ట్యాంకులపై హాట్ వీల్స్ బ్రాండింగ్‌తో పాటు ఫ్రేమ్‌పై అదే రంగు చారలను కలిగి ఉండటం విశేషం.ఇక ఈ మోటార్ సైకిల్ స్పెషల్ కలర్ స్కీమ్ బ్లాక్ కలర్ ప్యానెల్స్‌తో మిక్స్ చేయబడింది.అందుకే ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.ఇక అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ హాట్ వీల్స్ బ్రాండ్ లోగోను కలిగి ఉన్న హ్యాండిల్‌బార్‌లో ఫోమ్ ఇంకా సీటును పొందుతుంది. బైక్ ఆల్-బ్లాక్ థీమ్‌తో కొనసాగింపు కోసం, కంపెనీ బ్యాటరీ ట్యాంక్ ప్యాడ్ ఇంకా చైన్ అలాగే ఫ్రేమ్ మధ్యలో ఉన్న పెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ ప్యానెల్‌ను బ్లాక్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: