బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ బైక్ విడుదల.. వివరాలు..
ఇక కంపెనీ దీనిని క్రూయిజర్ బైక్ అని చెబుతున్నప్పటికీ ఇది చూడటానికి ఇది నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్‌లా ఉంటుందట. అలాగే ఇక ఈ బైక్‌లో చాలా తక్కువ సీటింగ్ స్పేస్ అనేది ఉంటుంది.అందుకే ఇది ఒక్క రైడర్ కోసం మాత్రమే డిజైన్ చేయబడినట్లుగా ఉంది.ఇక అలాగే దీని తక్కువ సీట్ హైట్ కారణంగా బెనెల్లీ 502సి అర్బన్ క్రూయిజర్ బైక్, రైడర్‌కు అల్ట్రా-కంఫర్టబుల్ రైడ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ పేర్కొనడం జరిగింది. ఇక ఇందులో సింగిల్ పీస్ ఫ్లోటింగ్ సీట్ అనేది ఉంటుంది. అలాగే దీని డిజైన్ కూడా చాలా ఏరోడైనమిక్‌గా ఉంటుంది.ఇక ఈ బైక్‌లో మజిక్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ అలాగే పూర్తి ఎల్‌ఈడి లైటింగ్ ఇంకా సౌకర్యవంతమైన సస్పెన్షన్ సెటప్ తో పాటుగా డబుల్ బారెల్ స్టీల్ ఎగ్జాస్ట్ పైప్ మొదలైన ఫీచర్లు అనేవి ఉన్నాయి. ఇక ఈ బైక్ యొక్క బాహ్య రూపకల్పన అన్ని వైపుల నుండి మజిక్యులర్‌గా కనిపిస్తుంది. అలాగే ఇది మంచి రోడ్ ప్రజెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది.