రికార్డు స్థాయిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ బుకింగ్స్..

Purushottham Vinay
ఇండియా మార్కెట్లో ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేయడానికి తగిన అన్ని సన్నాహాలను సిద్ధం చేస్తోందన్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కూటర్ ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి ముందే కంపెనీ బుకింగ్స్ ని ప్రారంభించడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఓలా కంపెనీ సిఈఓ భవిష్ అగర్వాల్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది.ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ బుకింగ్స్ జూలై 15 నుండి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో బుకింగ్ కోసం అందుబాటులో ఉంచబడింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కేవలం 24 గంటల్లోనే 1 లక్షకు పైగా స్కూటర్లు బుక్ చేసుకున్నట్లు కంపెనీ తాజా నివేదిక ద్వారా తెలిపడం జరిగింది. అయితే ఒక్కసారికా భారీగా బుకింగ్స్ జరగడం వల్ల వెబ్‌సైట్‌ హెవీ ట్రాఫిక్ ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ కారణంగా ఓలా కంపెనీ వెబ్‌సైట్ క్రాష్ అవ్వడం జరిగింది.అయితే దీనిని కంపెనీ కొన్ని నిమిషాల్లో కంపెనీ పరిష్కరించింది.ఇక ఓలా చైర్మన్ ఇంకా గ్రూప్ సిఇఒ భవీష్ అగర్వాల్ మాట్లాడుతూ, ఇండియా అంతటా కూడా కస్టమర్ల నుండి అధిక స్పందన లభించడం పట్ల చాలా ఆనందంగా ఇంకా అలాగే ఆశ్చర్యంగా ఉంది.

 ఇండియా మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై కస్టమర్లకు ఉన్న ఆసక్తి ఏవిధంగా ఉందొ తెలుస్తుంది.ఈ ప్రపంచాన్ని ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించడానికి మేము తగిన ప్రయత్నాలు చేస్తున్నాము. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు.ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ ఈ నెల చివరలో లేదా వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉందట. ఇటీవల ఈ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఓలా స్కూటర్‌ ఎస్, ఎస్ 1 ఇంకా ఎస్ 1 ప్రో అనే వేరియంట్లలో తీసుకు వచ్చే అవకాశం ఉండాలి అని తెలుస్తుంది. అయితే కంపెనీ దీని గురించి మాత్రం ఇంకా అధికారిక సమాచారం ఇంకా వెల్లడించలేదు.ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే..ఒక పూర్తి ఛార్జీతో ఇది 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిని ఇవ్వగలదు. ఇక అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్  టాప్ స్పీడ్ గంటకు వచ్చేసి 90 కిమీ వరకు ఉంటుందట. ఇక ఈ స్పెసిఫికేషన్‌తో ఇంకా ఇది హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో చేరే అవకాశం కూడా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: