సూపర్ డిజైన్ తో హోండా నుంచి మంకి 125 సిసి బైక్ ..

Purushottham Vinay
ఇక సూపర్ డిజైన్ తో హోండా నుంచి మంకి 125 సిసి బైక్ రాబోతుంది..హోండా మోటార్ బైక్ కంపెనీ తన మంకీ మినీ బైక్ ని మొదటసారిగా 1960 సంవత్సరంలో ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు ఈ కొత్త మంకీ మినీ బైక్ కొత్త 124 సిసి ఇంజిన్‌తో వస్తుంది. ఈ కొత్త మంకీ బైక్ చూడటానికి దాని మునుపటి మోడల్ లా ఉన్నప్పటికీ, దీనికి కొత్త కలర్ ఆప్షన్స్ ఇంకా కొన్ని చిన్న మార్పులను ఇక్కడ గమనించవచ్చు.ఇక ఈ కొత్త బైక్ రైడర్స్ కి అనుకూలంగా ఉండటానికి, ఇంకా అలాగే కస్టమైజ్ చేసుకోవడానికి యాక్ససరీస్ కూడా అందించబడ్డాయి.ఇక ఈ కొత్త బైక్ యంగ్ అండ్ డైనమిక్ రైడర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది. ఇక ఈ బైక్ రైడర్లకి మంచి రైడింగ్ అనుభవాన్ని అందించే విధంగా అప్డేట్ చేశారు.ఇక ఈ సరికొత్త హోండా మంకీ మినీ బైక్ ఫుల్లీ ఎల్‌ఈడీ లైటింగ్‌తో వస్తుంది.

 ఇక అంతేగాక బటన్ నొక్కినప్పుడు వెలిగించే పుష్ బటన్‌ కూడా ఇందులో ఉండటం విశేషం. ఇక ఈ బైక్ మొత్తం బరువు కూడా దాదాపు 107 కిలోల నుండి 104 కిలోలకు తగ్గిచబడింది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ బైక్ ఎలక్ట్రానిక్స్ లో అయితే ఎటువంటి మార్పు చేయలేదు.ఇక ఈ హోండా మంకి మినీ బైక్‌లో 124 సిసి ఎస్‌ఓహెచ్‌సి ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. అలాగే ఈ ఇంజిన్ 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 9.4 బిహెచ్‌పి శక్తిని, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 11 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ యాడ్ చేయబడి ఉంటుంది.ఇక ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసరికి గంటకు 91 కిమీ. ప్రయాణిస్తుంది. ఇక ఇది 67 కిలోమీటర్ల ఫ్యూయల్ పవర్ కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: