హీరో నుంచి మిడిల్ వెయిట్ తో కొత్త బైక్..

Purushottham Vinay
ఇండియాస్ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాగా పాపులర్ అయ్యింది.ఇక హీరో మిడిల్‌వెయిట్ తో కొత్త బైక్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.ఇక తొందర్లోనే ఈ బైక్‌లు మార్కెట్లోకి వస్తాయి.ఈ మిడిల్ వెయిట్ బైక్ గురించి హీరో మోటోకార్ప్ కంపెనీ అలాగే అమెరికా చెందిన టూ వీలర్ సంస్థ హార్లే డేవిడ్సన్ కొన్ని నెలల క్రితం ఒక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.చర్చలు కూడా మొదలైనట్లు వార్తలు వచ్చాయి.కానీ అధికారిక సమాచారం కంపెనీ అందించలేదు.తెలుస్తున్న సమాచారం ప్రకారం, హీరో మోటోకార్ప్ మిడిల్ వెయిట్ విభాగంలో ట్విన్-టైప్ బైక్‌ను విడుదల చేయడానికి తగిన సమయం కోసం చూస్తోంది. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ ఇంకా హార్లే డేవిడ్సన్, టీవీఎస్ ఇంకా బిఎమ్‌డబ్ల్యూ మధ్య భాగస్వామ్యం ఉందని ఆటో మొబైల్ పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్.. బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్ బైక్ ఇంజన్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేయబడింది. హీరో మోటోకార్ప్‌తో చేసుకున్న ఒప్పంద నిబంధనల ప్రకారం, హీరో మోటోకార్ప్ ప్రస్తుతం హార్లే డేవిడ్సన్ బైక్ డెలివరీ అలాగే సేల్స్ వంటి వాటిని నిర్వహిస్తోంది.హార్లే డేవిడ్సన్ బైక్ కోసం మోడరేట్ కెపాసిటీ బైక్‌పై కూడా పనిచేస్తోంది. రీబ్యాడ్జ్ వెర్షన్‌ను హీరో మోటోకార్ప్ బ్రాండ్ కింద కూడా ఉత్పత్తి చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రతి బైక్ విభాగం ఇంజిన్ సామర్థ్యంతో మారుతుంది.
అందువల్ల గ్లోబల్ మార్కెట్లో, మిడిల్ వెయిట్ విభాగంలో 500 సిసి ఇంజన్ కెపాసిటీ అలాగే 900 సిసి సామర్థ్యంతో బైక్‌లు అమ్ముడవుతాయి. భారతీయ వినియోగదారులు 350 సిసి నుండి 400 సిసి బైక్‌లను కొనుగోలుచేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు.ప్రస్తుతం ఈ విభాగంలో దేశీయ మార్కెట్లో చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఆధిపత్యం చెలాయించింది. ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కు దాదాపు 90% వాటా ఉంది. ఇక హీరో మోటోకార్ప్ రిలీజ్ చేయబోయే కొత్త బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీ పడబోతుంది.చూడాలి ఈ బైక్ బాగా పికప్ అవుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: