మార్కెట్ ను షేక్ చేస్తున్న స్కూటర్లు ఇవే..

Satvika
ద్విచక్ర వాహనాలు ఈ మధ్య మార్కెట్ లో రోజుకొకటి విడుదల అవుతున్నాయి. అయితే వాటికి కొన్ని మాత్రమే జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో కొన్ని బెస్ట్ స్కూటర్లు ఉన్నాయని అంటున్నారు. అవేంటో , ఏ కంపెనీ నుంచి వచ్చినవి అనేది ఇప్పుడు చూద్దాం..ఇప్పటికే ఎన్నో స్కూటర్ కంపెనీలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. జనాలకు ప్రతి రోజూ ఉపయోగ పడేలా ఈ స్కూటర్లు ఉన్నాయి. రోజు వారీ అవసరాలను తీరుస్తూ వస్తున్నాయి. 


యాక్టివా ఎలక్ట్రిక్‌
జపాన్‌కు కంపెనీ హోండా.. త్వరలో 'యాక్టివా ఎలక్ట్రిక్‌' స్కూటర్‌ను అందుబాటు లోకి తీసుకురానున్నది. దీని రేంజ్‌ దాదాపు 90 నుంచి 100 కి.మీ. పయనిస్తుంది.

వెస్పా ఎలెక్ట్రికా

ఇటలీకి కంపెనీ వెస్పా త్వరలో 'వెస్పా ఎలెక్ట్రికా' ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నది. దీని ధర దాదాపు రూ.1.5 లక్షలు గా కంపెనీ నిర్ధారించింది.

బర్గ్‌మ్యాన్‌ ఎలక్ట్రిక్‌

జపాన్‌కే చెందిన సుజుకీ సంస్థ ఈ ఏడాది ద్వితీయార్ధం లో 'ఎలక్ట్రిక్‌ బర్గ్‌మ్యాన్‌'ను తీసుకురానున్నది. దీని ధర దాదాపు రూ.1.3 లక్షలు, రేంజ్‌ 75-80 కి.మీ వరకు మైలేజ్ ను ఇస్తుంది.

మ్యాస్ట్రో ఎలక్ట్రిక్‌
దేశీయ సంస్థ హీరో మోటోకార్ప్‌.. ఈ ఏడాది మధ్య నాటికి 'మ్యాస్ట్రో ఎలక్ట్రిక్‌' స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనున్నది. దీని ధర దాదాపు రూ.లక్ష. లిథియం అయాన్‌ బ్యాటరీని కలిగి ఉండే 'మ్యాస్ట్రో ఎలక్ట్రిక్‌'.. 110 సీసీ పెట్రోల్‌ ఇంజిన్‌తో నడిచే స్కూటర్ కు సమానంగా పని చేస్తుంది.

హీరో ఎలక్ట్రిక్‌ ఏఈ-29

హీరో నుంచే మార్చి నెల లో 'హీరో ఎలక్ట్రిక్‌ ఏఈ-29' ఈ-స్కూటర్‌ కూడా అందుబాటులోకి రానున్నది. ధర దాదాపు రూ.85 వేలు. రేంజ్‌ సుమారు 80 కి.మీ ల మైలేజి తో దూసుకు పోతుంది.

వీటితో ఇంకా ప్రముఖ కంపెనీల నుంచి వచ్చిన ఎన్నో స్కూటర్లు నిత్యం జనాలా అవసరాలను దృష్టి లో ఉంచుకుని సరికొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: