హోండా ద్విచక్ర వాహనాలు కొనేవారికి బంపర్ ఆఫర్...!

Kothuru Ram Kumar

కొత్త స్కూటీ కొనేవారికి బంపర్ ఆఫర్. ఎవరైనా హోండా కంపెనీ కి సంబంధించిన యాక్టివా స్కూటర్ ని కొనాలని అనుకుంటున్న వారికి లేదా ఏదైనా హోండా కంపెనీ నుండి వాహనాన్ని కొనాలని అనుకుంటున్న వారికి నిజంగా ఇది గుడ్ న్యూస్. తాజాగా హోండా సంస్థ అదిరిపోయే ఆఫర్స్ ని కస్టమర్స్ కు అందించబోతోంది. మీరు వాహనాన్ని కొనేటప్పుడు ఫైనాన్స్ తీసుకున్నా లేదా ఏదైనా క్రెడిట్ కార్డు ద్వారా మొత్తాన్ని కంతులు గా కడతామని అనుకున్నా వారికి కూడా ఈ ఆఫర్స్ లభిస్తాయి. నిజం చెప్పాలంటే ఫైనాన్స్ సదుపాయం తీసుకోవడమే చాలా ఉత్తమం కూడా.

 


ప్రస్తుతం మారిటోరియం సందర్భంగా ప్రైవేట్ బ్యాంకుల నుండి లోన్ తీసుకునే కస్టమర్ కేవలం సగం ఈఎంఐ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే కేవలం మొదటి మూడు నెలలు ఈఎంఐ సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇందుకు సంబంధించిన లోన్ సమయాన్ని 36 నెలల వరకు మనం తీసుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ బ్యాంకులలో ఏకంగా 95 శాతం వరకు లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. కాబట్టి కేవలం ఐదు శాతం మాత్రమే పేమెంట్ చెల్లించి కొత్త బైక్ ని పొందవచ్చు. ప్రస్తుతం హోండా కంపెనీ నుండి లభిస్తున్న యాక్టివా 125, యాక్టివా 6జి, హోండా షైన్, లివో, సీడీ 110 డ్రీం, డియో, గ్రేజియా వంటి వాహనాలను ఈ స్కీమ్ ద్వారా మనం పొందవచ్చు.

 

 

అంతేకాదు ఎస్ బిఐ క్రెడిట్ కార్డు తో హోండా టూ వీలర్ కొనుగోలు చేస్తే ఫైవ్ పెర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. అయితే ఇది కేవలం కొంతమంది డీలర్ల వద్ద మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. హోండా కంపెనీ ఈ నెలలో లివో, సీడీ 110 డ్రీమ్, గ్రేజియా బిఎస్ 6 మోడల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: