ప్లాటినా 110 ఏబీఎస్: అప్‌డేటెడ్ ఫీచర్లతో లాంచ్?

Purushottham Vinay
ప్రస్తుతం ప్రపంచం లో ప్రయాణాలకు ఎన్నో సులభతరమైన మార్గాలు ఆవిష్కరించబడుతున్నాయి. భూమి, ఆకాశం, సముంద్రం ఎక్కడైనా మనిషి అత్యంత వేగంగా ప్రయాణించే సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మోటార్ వాహనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ బైక్, కారు మెయింటేన్ చేస్తున్నారు. భారత్ మార్కెట్ లో బాజాజ్ మోటర్ వాహనాలకు ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు ఎన్నో రకాల బైక్స్ లాంచ్ చేసింది బజాజ్ ఆటో కంపెని. తాజాగా  బజాజ్ ఆటో తన అప్‌డేటెడ్ 'ప్లాటినా 110 ఏబీఎస్' (Platina 110 ABS) లాంచ్ చేసింది.ఈ అప్డేటెడ్ బైక్ ధర వచ్చేసి మార్కెట్లో రూ. 72,224 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది.ఈ అప్డేటెడ్ బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ 110 సీసీ సెగ్మెంట్‌లో ABS  బైక్. ఇది 115.45 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంకా అలాగే ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ కలిగి ఉంది.దీని ఇంజిన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 8.4 బిహెచ్‌పి పవర్ ఇంకా అలాగే 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎమ్ టార్క్‌ ని అందిస్తుంది. అలాగే ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేయబడి ఉంటుంది.ఇంకా ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ తో రానుంది. ఈ బైక్ లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇది బైక్ గురించి రైడర్ కి చాలా సమాచారం ఇస్తుంది. ఇందులో ఏబీఎస్ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇంకా గేర్ గైడెన్స్ ఫంక్షన్‌ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇవి రైడర్లకి చాలా అనుకూలంగా ఉంటాయి.

కలర్స్ విషయానికి వస్తే బజాజ్ ప్లాటినా 110 ఏబీఎస్ బైక్ మొత్తం నాలుగు కలర్లలో రానుంది. అవి ఎబోనీ బ్లాక్, గ్లోస్ ప్యూటర్ గ్రే, కాక్‌టెయిల్ వైన్ రెడ్ ఇంకా సఫైర్ బ్లూ. ఇవన్నీ కూడా చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటాయి.ఇంకా ఈ బైక్ సౌకర్యవంతమైన సీట్లని కలిగి ఉంటుంది. అందువల్ల ఇది ఇది రైడింగ్ సమయంలో మంచి కంఫర్ట్ ని అందిస్తుంది. అంతే కాకుండా ఈ బైక్ లో లేటెస్ట్ హెడ్‌లైట్‌ సెటప్ ఉండటం వల్ల రైడర్ కి స్పష్టమైన విజువల్స్ ని అందిస్తాయి. ఈ అప్డేటెడ్ బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఇంకా బ్యాక్ సైడ్ డ్యూయల్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జార్బర్‌ వంటి వాటి ఫీచర్స్ కలిగి ఉంది.ఈ బైక్ సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఇంకా వెనుక భాగంలో డ్రమ్‌తో ముందు భాగంలో డిస్క్ ని కలిగి ఉంటుంది. అందువల్ల బ్రేకింగ్ సిస్టం చాలా షార్ప్ గా ఉంటుంది. అలాగే ఈ బైక్ మంచి సస్పెన్షన్ సెటప్, బ్రేకింగ్ సిస్టం వంటివి పొందటంతో పాటు అప్డేటెడ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ బైక్ ఇప్పుడు పనితీరు పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: