హీరో నుంచి Xpulse 200 2V బైక్ తొలగింపు?

Purushottham Vinay
ఇక ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ కంపెనీ 'హీరో మోటోకార్ప్' తన వెబ్‌సైట్ జాబితాలో Xpulse 200 2V బైక్ ని తొలగించింది.ఇక కంపెనీ దేశీయ మార్కెట్లో Xpulse 200 2V అమ్మకాలను నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.అయితే హీరో మోటోకార్ప్ కంపెనీ తన Xpulse 200 2V బైకుని వెబ్‌సైట్ నుంచి తొలగించడానికి గల కారణాన్ని వెల్లడించనప్పటికీ, Xpulse లైనప్‌ను మోడీఫై చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సమాచారం తెలుస్తోంది.  కంపెనీ త్వరలో తీసుకురానున్న 300 సిసి అడ్వెంచర్ బైక్ కి తన లైనప్‌లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ లైనప్‌లో Xpulse 200 4V ఇంకా అలాగే Xpulse 200T ఉన్నాయి.ఇక ఇండియన్ మార్కెట్లో ఈ hero Xpulse 200 2V బైక్ ధర రూ. 1.27 లక్షలు ఉంది. అయితే ఇది దాని Xpulse 200 4V కంటే కూడా ఏకంగా రూ. 10,000 తక్కువ. అంటే మార్కెట్లో ప్రస్తుతం Xpulse 200 4V ధర వచ్చేసి రూ. 1.37 లక్షలు. దీన్ని బట్టి చూస్తే హీరో మోటోకార్ప్  200 2V సరసమైన అడ్వెంచర్ టూరింగ్ బైక్ అని తెలుస్తుంది.


అందువల్ల ఎక్కువమంది ఈ బైక్ వినియోగించడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారు.ఇక ఈ hero Xpulse 200 2V బైక్ 199.6 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ ని పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.8 బిహెచ్‌పి పవర్ ఇంకా అలాగే 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.45 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్ కి యాడ్ చేయబడి ఉంటుంది. కాగా ఇది 200 4V కంటే కూడా 1.3 హెచ్‌పి పవర్ ఇంకా అలాగే 0.9 ఎన్ఎమ్ టార్క్ ని తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ హీరో Xpulse 200 2V మంచి డిజైన్ ఇంకా ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్ ఇంకా అలాగే బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటివి ఉన్నాయి.ఇక అంతే కాకూండా ఈ బైక్ వైట్, మ్యాట్ గ్రీన్, మ్యాట్ గ్రే, స్పోర్ట్స్ రెడ్ ఇంకా పాంథర్ బ్లాక్ అనే కలర్  లో కూడా లభిస్తుంది. అందువల్ల బైక్ రైడర్లు ఇందులో తమకు నచ్చిన కలర్ ని ఎంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: