కవాసకి డబ్ల్యు175 డెలివరీలు స్టార్ట్?

Purushottham Vinay
ఇక 'కవాసకి ఇండియా' ఇండియన్ మార్కెట్లో ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో 'డబ్ల్యు175' (W175) బైక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే కంపెనీ ఇప్పుడు ఎట్టకేలకు ఈ బైక్ డెలివరీలను స్టార్ట్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు  తెలుసుకుందాం..ఈ కవాసకి డబ్ల్యు175 బైక్ ఎబోనీ (స్టాండర్డ్) ఇంకా స్పెషల్ ఎడిషన్ రెడ్ (స్పెషల్ ఎడిషన్) అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇంకా వీటి ధరలు వరుసగా రూ.1,47,000 ఇంకా రూ.1,49,000. ఇక ఇందులో ఒకటి పూర్తిగా బ్లాక్ థీమ్ అయితే, రెండోది వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ లో డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అయితే రెండింటిలో కూడా ఫ్రంట్ సస్పెన్షన్, హెడ్‌లైట్ కేసింగ్, ఇంజన్, స్వింగార్మ్ ఇంకా ఎగ్జాస్ట్ పైప్ వంటి భాగాలు బ్లాక్ కలర్ లో ఉన్నాయి.ఇక కవాసకి డబ్ల్యు175 బైక్ లో 177 సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ని ఉంటుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 13 హెచ్‌పి పవర్ ఇంకా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 13.2 ఎన్ఎమ్ టార్క్‌ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌కి యాడ్ చేయబడి ఉంటుంది. అందువల్ల  మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇక అంతే కాకుండా ఇంజిన్ బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా కూడా ఇది అప్డేట్ చేయబడి ఉంటుంది.


ఇక కవాసకి డబ్ల్యు175 చూడటానికి కొంత దాకా దాని డబ్ల్యు800 ని పోలి ఉంటుంది, ఎందుకంటే డబ్ల్యు175 తన డబ్ల్యు800 నుంచి ప్రేరణ పొందినట్లు చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో రౌండ్ హెడ్‌లైట్, టియర్-డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్ ఇంకా అలాగే బాక్సీ సైడ్ ప్యానెల్ వంటివి W800 ని గుర్తుకు తెస్తాయి. అలాగే వెనుక వైపు టెయిల్-లైట్ ఇంకా ఇండికేటర్స్ వంటి వాటితో పాటు వెనుక భాగంలో ఒక వంపు తిరిగిన ఫెండర్‌ని కూడా మీరు చూస్తారు.ఈ కవాసకి డబ్ల్యు175 బైక్ సింగిల్ పీస్ సీటుని పొందుతుంది. అలాగే ఇది మంచి రైడింగ్ పొజిషన్ ని అందించడం వల్ల రైడర్ చాలా అద్భుతమైన రైడింగ్ అనుభూతిని కూడా పొందవచ్చు. ఇంకా దీని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో అనలాగ్ స్టైల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ ఇంకా అలాగే టర్న్ సిగ్నల్స్‌తో ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటివి కూడా ఉన్నాయి. ఇంకా అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: