ఏథర్ ఎనర్జీ: దీపావళి నాడు సూపర్ రికార్డ్?

Purushottham Vinay
బెంగళూరు సిటీకి చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీ 'ఏథర్ ఎనర్జీ'  ఇండియన్ మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందిన కంపెనీ. ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్లో ఏథర్ 450 ఇంకా 450ఎక్స్ అనే రెండు స్కూటర్లను అమ్ముతుంది.ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ శరవేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇటీవల కంపెనీ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిలో ఒక కొత్త రికార్డ్ నెలకొల్పింది. కాగా ఇప్పుడు డెలివరీలలో కూడా మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. ఏథర్ ఎనర్జీ దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 23 న మొత్తమ్ 250 యూనిట్ల 'ఏథర్ 450X' ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. ఒకే రోజు ఇన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయడం బహుశా ఇదే మొదటిసారి అవ్వొచ్చు.కస్టమర్ల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన 'ఏథర్ ఎనర్జీ' యొక్క అమ్మకాలు నత్తనడకన సాగేవి, అయితే క్రమంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల  అమ్మకాలు మరీ జోరందుకున్నాయి. కాగా ఇప్పుడు దేశంలో దాదాపు 10,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్లు రోడ్డుపైన తిరుగుతున్నాయి.


రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.విజయ దశమి ఇంకా దీపావళి పండుగల సందర్భంగా ఎక్కువమంది కొత్త వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటారు. ఈ కారణంగానే ఎక్కువ సంఖ్యలో కొత్త వాహనాలు అమ్ముడవవుతాయి. సాధారణ రోజుల్లో పోలిస్తే, పండుగల సీజన్లో వాహనాల  అమ్మకాలు రెట్టింపుగా ఉంటాయి.ఏథర్ ఎనర్జీ ప్రారభించిన ఈ మెగా డెలివరీ సమయంలో కస్టమర్లతో కోలాహలంగా మారింది. ఇందులో కంపెనీ  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్  అన్ని కలర్స్ చూడవచ్చు. మొత్తం మీద కంపెనీ ఒకే రోజు 250 మంది కస్టమర్లకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అందించింది.ఇక ఏథర్ కంపెనీ ఇటీవల కొత్త 2022 మోడల్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 (Ather 450X Gen 3) మోడల్‌ విడుదల చేసింది. ఇది 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌ పొందుతుంది. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ 19 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ పైన మాక్సిమం 146 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని సర్టిఫైడ్ చేయబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: