Citroen C3 ఎలక్ట్రిక్ కార్.. రేపే విడుదల?

Purushottham Vinay
ఫ్రెంచ్ కార్ కంపెనీ అయిన సిట్రోయెన్ ఇండియన్ మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు రెడీ అయింది. భారతదేశంలో నేడు విడుదల కాబోతున్న టాటా టియాగో ఈవీ హ్యాచ్‌బ్యాక్‌కు పోటీగా సిట్రోయెన్ తమ C3-ఆధారిత ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను సెప్టెంబర్ 29, 2022వ తేదీన భారతదేశంలో లాంచ్ చేయనుంది.ఇండియాలో సిట్రోయెన్ ఇప్పటికే సి5 ఎయిర్‌క్రాస్ అనే ఎస్‌యూవీని ఇంకా సి3 అనే హ్యాచ్‌బ్యాక్‌ను విక్రయిస్తోంది. ఇవి రెండూ కూడా సాంప్రదాయ ఇంజన్లతో నడిచే వాహనాలు. కాగా, సిట్రోయెన్ సి3 ఆధారంగా రాబోతున్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ఈ బ్రాండ్‌కు భారత మార్కెట్లో మూడవ ఉత్పత్తి కానుంది. సిట్రోయెన్‌కు ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడం కొత్తేమీ కాదు, యూరోపియన్ మార్కెట్లో ఈ బ్రాండ్ విజయవంతంగా తమ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది.సిట్రోయెన్ సి3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ భారత మార్కెట్లో  టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో పోటీపడనుంది. మరికొద్ది గంటల్లోనే ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన అనేక వివరాలు వెల్లడి కానున్నాయి. సిట్రోయెన్ సి3 ఆధారిత ఎలక్ట్రిక్ కారును కంపెనీ రేపు లాంచ్ చేసినప్పటికి, దాని అధికారిక అమ్మకాలు మాత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగుతాయని సమాచారం.


సిట్రోయెన్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో, సిట్రోయెన్ సి4 ఆధారంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ కారును సిట్రోయెన్ ఇ-సి4  పేరుతో విక్రయిస్తోంది. ఈ మోడల్ పెద్ద 50kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఫలితంగా, సిట్రోయెన్ e-C4 పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 350 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అంతే కాకుండా, సిట్రోయెన్ ఇ-సి4 ఎలక్ట్రిక్ కారులో శక్తివంతమైన 135 బిహెచ్‌పి పవర్ ఇంకా 260 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారు కూడా ఉంటుంది.సిట్రోయెన్ ఇ-సి4 ఎలక్ట్రిక్ కారును 100kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి ఛార్జ్ చేస్తే కేవలం 30 నిమిషాల్లోనే 80 శాతం వరకూ చార్జ్ చేసుకోవచ్చు. సమాచారం ప్రకారం, సిట్రోయెన్ నుండి భారత మార్కెట్లో విడుదల కాబోయే సి3 ఆధారిత ఎలక్ట్రిక్ కారును కూడా ఇదే విధంగా సిట్రోయెన్ ఇ-సి3 పేరుతో విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అయితే, రాబోయే Citroen C3 ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరలను పోటీగా ఉంచడానికి కంపెనీ ఇదే విధమైన పవర్‌ట్రెయిన్‌ని అందిస్తుందా లేదా అనే దానిపై ప్రస్తుతం ఖచ్చితమైన సమాచారం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: