టాటా: రేపు కొత్త ఎలక్ట్రిక్ కార్ విడుదల?

Purushottham Vinay
ఇండియాలో ప్రెజెంట్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో టాప్ లో ఉన్న టాటా మోటార్స్ రేపు తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీని విడుదల చేయనుంది.టాటా మోటార్స్ నుండి రాబోయే కొత్త టియాగో ఈవీ దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించనుంది. మార్కెట్లో ఇది టాటా నుండి లభ్యం కానున్న మూడవ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కారు అవుతుంది.కంపెనీ ఇప్పటికే, నెక్సాన్ ఈవీ ఇంకా టిగోర్ ఈవీలను విక్రయిస్తోన్న సంగతి తెలిసినదే. తాజాగా, టాటా మోటార్స్ తమ టియాగో ఈవీ లాంచ్‌కి సంబంధించి ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలో వెల్లడించిన వివరాల ప్రకారం, టాటా టియాగో ఈవీ గ్రిల్‌కు ఇరువైపులా ట్రై-యారో ప్యాటర్న్ లతో కూడిన గ్రిల్ ఉంటుంది. కాకపోతే, ఈ గ్రిల్ ట్రెడిషన్ ఓపెన్ హోల్ గ్రిల్ మాదిరిగా కాకుండా పూర్తిగా సీల్ చేయబడిన గ్లోస్-బ్లాక్ ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను దాని సాధారణ మోడల్‌ నుండి వేరు చేయడానికి వీలుగా ఈ ఫ్రంట్ గ్రిల్‌కు కుడి వైపున 'EV' బ్యాడ్జ్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది.టాటా మోటార్స్ ఇదివరకు వెల్లడించిన వివరాల ప్రకారం, రాబోయే టాటా టియాగో ఈవీ కంపెనీ  జీకనెక్ట్ (ZConnect) కార్ టెక్నాలజీ, లెథెరెట్ సీట్లు, క్రూయిజ్ మోడ్ మరియు వన్-పెడల్ డ్రైవ్‌లను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.


అంతేకాకుండా, కొత్త టాటా టీఆగో EV లోని మెరుగైన బ్యాటరీ (బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్) టెక్నాలజీ కారణంగా వన్-పెడల్ డ్రైవ్ సాధ్యమవుతుందని, ఫలితంగా మెరుగైన రేంజ్ పొందవచ్చని కంపెనీ పేర్కొంది.టియాగో ఈవీ బాడీ షేప్  లైటర్ కర్బ్ వెయిట్ కారణంగా ఇది టాటా టిగోర్ ఈవీ (సబ్-4 మీటర్ ఎలక్ట్రిక్ సెడాన్)తో పోలిస్తే ఎక్కువ రేంజ్ ను మరియు మెరుగైన పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది. కొత్త టాటా టియాగో ఈవీ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో కూడా టాటా టిగోర్ ఈవీలో ఉపయోగిస్తున్న అదే 350V జిప్‌ట్రాన్ ఈవీ సిస్టమ్‌ను ఉపయోగించవచ్చని సమాచారం తెలుస్తుంది.ఇందులో 26 kWh బ్యాటరీ ప్యాక్‌ ఇంకా అలాగే 170 ఎన్ఎమ్ టార్క్‌, 74 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే, టాటా టిగోర్ ఈవీ 25 kW ఫాస్ట్ ఛార్జర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో కేవలం 65 నిమిషాల్లోనే బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే సాధారణ 15A ప్లగ్ పాయింట్ ద్వారా చేస్తే సుమారు 8 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: