Volvo XC40: ఇండియాలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌.. ఎప్పుడంటే?

Purushottham Vinay
స్వీడన్‌ కి చెందిన ఫేమస్ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో , భారతదేశంలో అమ్ముతున్న తమ పాపులర్ ఎస్‌యూవీ "వోల్వో ఎక్స్‌సి40" (Volvo XC40)లో ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.తెలుస్తున్న సమాచారం ప్రకారం కొత్త 2022 వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ఈనెల (సెప్టెంబర్) 21వ తేదీన ఇండియన్ మార్కెట్లో విడుదల కానుంది.వోల్వో కార్స్ ఇండియా లిమిటెడ్ తొలిసారిగా తమ ఎక్స్‌సి40 ఎస్‌యూవీని 2018లో భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ఇప్పుడు ఇందులో కంపెనీ మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.ఇక ఈ కొత్త మోడల్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి వచ్చింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, కొత్తగా రాబోయే వోల్వో ఎక్స్‌సి40 మోడల్ ఎక్స్టీరియర్ ఇంకా అలాగే ఇంటీరియర్లలో కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను అందుకోనుంది.


ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2022 వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీలో మంచి షార్ప్‌గా ఉండే హెడ్‌ల్యాంప్‌లు, రీప్రొఫైల్ చేయబడిన బంపర్లు, కొత్త అల్లాయ్ వీల్స్ వంటి చిన్నపాటి కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. ఓవరాల్‌గా ఇది వోల్వో ఇండియా ఇటీవల భారత మార్కెట్లో విడుదల చేసిన తమ ఎలక్ట్రిక్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ మోడల్‌ను తలపించేలా ఉంటుంది. ఈ కొత్త మోడల్‌లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో పాటుగా కంపెనీ మరిన్ని ఫీచర్లను కూడా అందించనుంది.అయితే, వోల్వో ఎక్స్‌సి40 లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఇందులో మునుపటి మోడల్‌లో ఉపయోగించిన అదే 2.0 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. కాకపోతే, ఈ పెట్రోల్ ఇంజన్ ఇప్పుడు మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. పెట్రోల్ వెర్షన్‌లోని ఈ ఇంజన్ 187 బిహెచ్‌పి పవర్ ను ఇంకా అలాగే 300 ఎన్ఎమ్ టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేయబడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: