మారుతి సుజుకి ఎక్స్ఎల్6: సూపర్ ఫీచర్స్?

Purushottham Vinay
ఇండియన్ మార్కెట్లో మీరు ఓ మంచి ఎమ్‌పివి కోసం వెతుకుతున్నట్లయితే, మారుతి సుజుకి తమ నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయిస్తున్న ఎక్స్ఎల్6 కార్ చాలా మంచి ఆఫర్ అని చెప్పొచ్చు.మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మారుతి సుజుకి ఎర్టిగా లాగా ఉంటుంది. ఇక ఎర్టిగాను మాస్ మార్కెట్ లక్ష్యంగా చేసుకొని విడుదల చేయగా, ఎక్స్ఎల్6ను ప్రీమియం కస్టమర్లను టార్గెట్‌గా చేసుకొని ప్రవేశపెట్టారు. ఎర్టిగా 7-సీటర్ ఆప్షన్‌తో లభిస్తుంటే, ఎక్స్ఎల్6 ఎమ్‌పివి 6-సీటర్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఎర్టిగాతో పోల్చుకుంటే, ఎక్స్‌ఎల్6 ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా, చాలా ఎక్కువ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.మారుతి సుజుకి గడచిన 2019లో తొలిసారిగా ఎక్స్ఎల్6  ఎమ్‌పివిని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కంపెనీ ఇందులో మొదటిసారిగా ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఎక్స్ఎల్6 ఎమ్‌పివి అయినప్పటికీ చూడటానికి ఎస్‌యూవీ వైఖరిని కలిగి ఉంటుంది. కారు చుట్టూ చంకీగా కనిపించే బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ ఇంకా మజిక్యులర్ బాడీ లైన్స్‌తో ఎక్స్ఎల్6 మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.


ముందు భాగంలో పెద్ద గ్రిల్, క్రోమ్ గార్నిష్, బంపర్ దిగువ భాగంలో ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ఆకర్షణీయమైన ఎల్‌ఈడి హెడ్‌లైట్, ఎల్‌ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో ఇది చాలా అందంగా కనిపిస్తుంది.సైడ్స్‌లో 16 ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, స్ట్రక్చర్డ్ సైడ్ బాడీ ప్యానెల్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన బాడీ కలర్ సైడ్ మిర్రర్స్ అలాగే క్రోమ్ ఫినిష్డ్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ అవుట్ చేయబడిన బి, సి పిల్లర్స్, రూఫ్‌ని అంటిపెట్టుకుని ఉండే స్పాయిలర్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ హైలైట్‌గా నిలుస్తాయి. కంపెనీ ఈ కొత్త 2022 మోడల్ ఎక్స్ఎల్6 ఎమ్‌పివిని సెలెస్టియల్ బ్లూ, బ్రేవ్ ఖాకీ, ఆర్కిటిక్ వైట్, గ్రాండియర్ గ్రే, ఓపులెంట్ రెడ్ ఇంకా స్ప్లెండిడ్ సిల్వర్ అనే కలర్ ఆప్షన్లలో అందిస్తోంది.కొత్త 2022 మారుతి సుజుకి ఎక్స్ఎల్6 ఇంటీరియర్స్‌లో లభించే ఫీచర్లను గమనిస్తే, ముందు వైపు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు నావిగేషన్, స్పీడ్, ఇంజన్ ఆర్‌పిఎమ్ వంటి వివరాలను విండ్‌షీల్డ్‌పై ప్రదర్శించే కొత్త హెడ్స్-అప్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇంకా ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో పాటుగా బిల్ట్-ఇన్ సుజుకి కనెక్ట్ టెలిమాటిక్స్‌తో కూడిన కొత్త 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ డిస్‌ప్లే యూనిట్ 360 డిగ్రీ కెమెరా ఫీచర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: