సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌: సూపర్ ఉందిగా?

Purushottham Vinay
ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్న ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ 'సిట్రోయెన్'  ఇండియన్ మార్కెట్లో తన కొత్త 'సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' విడుదల చేసింది.ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌ ధర రూ. 36.67 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ  కొత్త కారుకి కొనుగోలు చేయాలనుకే కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లో లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.ఇండియన్ మార్కెట్లో 'సి5 ఎయిర్‌క్రాస్ ఫేస్‌లిఫ్ట్‌' ఇప్పుడు కేవలం ఒకే వేరియంట్ లో మాత్రమే విడుదలైంది. అది సి5 ఎయిర్‌క్రాస్ షైన్‌ వేరియంట్. అయితే సాధారణ 'సి5 ఎయిర్‌క్రాస్' మాత్రం ఫీల్ ఇంకా షైన్ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.ఈ కొత్త C5 ఎయిర్‌క్రాస్ మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి పెర్ల్ వైట్, పెర్ల నెరా బ్లాక్, క్యుములస్ గ్రే ఇంకా ఎక్లిప్స్ బ్లూ. ఇందులో ఎక్లిప్స్ బ్లూ అనేది కొత్త కలర్ అప్సన్. ఇవన్నీ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి.కంపెనీ విడుదల చేసిన కొత్త సి5 ఫేస్‌లిఫ్ట్‌ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది డ్యూయెల్ టోన్ లో అందుబాటులో ఉంది.


దీని ముందు భాగంలో బ్రాండ్ లోగో, ర్యాప్-అరౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ డిఆర్ఎల్ వంటివి ఉన్నాయి. ఈ కారు  బ్లాక్ గ్రిల్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 18 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌, వెనుక భాగంలో ఎల్ఈడీ లైట్ వున్నాయి.మొత్తం మీద ఈ కొత్త అప్డేటెడ్ మోడల్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది.ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా 12.3 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌కి ఆనుకుని క్యూబ్-ఆకారంలో ఉన్న AC వెంట్‌లు ఉన్నాయి. అంతే కాకూండా స్టాండర్డ్ గేర్ లివర్ స్థానంలో కొత్త టోగుల్ స్విచ్‌తో సెంటర్ కన్సోల్ కూడా కొంత అప్డేట్ చేయబడి ఉంది.ఈ అప్డేటెడ్ మోడల్ కూడా రెండవ వరుస ప్రయాణికుల కోసం ఇండియూజువల్ స్లైడింగ్, రిక్లైనింగ్ ఇంకా ముడుచుకునే సీట్లు ఉన్నాయి. పవర్డ్ డ్రైవర్ సీట్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: