ఇండియాలో ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌?

Purushottham Vinay
ఫేమస్ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ అయిన 'ఆడి' భారతీయ మార్కెట్లో ఇప్పటికే తన క్యూ7 విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఎట్టకేలకు క్యూ7 'లిమిటెడ్ ఎడిషన్‌' విడుదల చేసింది.దేశీయ మార్కెట్లో ఆడి ఇండియా లాంచ్ చేసిన కొత్త క్యూ7 లిమిటెడ్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త 'ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌' ధర రూ. 88.08 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఈ లగ్జరీ కారు ఇండియన్ మార్కెట్లో కేవలం 50 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే ఈ కొత్త SUV ని కేవలం 50 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలుచేయడానికి అవకాశం ఉంటుంది. కావున ఆసక్తిగల కస్టమర్లు వీలైనంత త్వరగా దీనిని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ కొత్త 'ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్‌' దాని టాప్-స్పెక్ టెక్నాలజీ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. కానీ ధర మాత్రం దాని స్టాండర్డ్ టెక్నాలజీ ట్రిమ్ కంటే కూడా తక్కువ కావడం విశేషం. అయితే ఈ కొత్త ఎడిషన్ లో లేటెస్ట్ ఫీచర్స్ ఇంకా పరికరాలు అందుబాటులో ఉంటాయి.ఆడి కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఎక్ట్సీరియర్ షేడ్‌ను పొందుతుంది. ఇది ఈ లగ్జరీ SUV కి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పవచ్చు.


అంతే కాకూండా ఇందులో రన్నింగ్ బోర్డ్‌లు, క్వాట్రో ఎంట్రీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, సింగిల్-పీస్ ఆక్టాగోనల్ ఫ్రంట్ గ్రిల్ మొదలైనవి ఇందులో ఉన్నాయి.ఇక ఇవన్నీ కూడా దాని డిజైన్ ని మరింత పెంచడంలో బాగా సహాయపడతాయి.ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 19 స్పీకర్ బ్యాంగ్, ఒలుఫ్సెన్ స్టీరియో సిస్టమ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, రిక్లైన్ ఫంక్షన్‌తో రెండవ వరుస సీట్లు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా బాగా అనుకూలంగా ఉంటాయి.కొత్త ఆడి క్యూ7 లిమిటెడ్ ఎడిషన్ 48వి మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో కూడా 3.0-లీటర్ వి6 పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 336.6 బిహెచ్‌పి పవర్ ఇంకా 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కి యాడ్ చేయబడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: