న్యూ ఎంజి గ్లోస్టర్: ఫీచర్స్, ధర ఇంకా పూర్తి వివరాలు?

Purushottham Vinay
ఎంజి మోటార్ ఇండియా ఇండియన్ మార్కెట్లో తన పోర్ట్‌ఫోలియోను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. ఇక ఇందులో భాగంగానే కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ '2022 గ్లోస్టర్‌' SUV కార్ ని విడుదల చేసింది.ఇక ఈ అప్డేటెడ్ గ్లోస్టర్‌ SUV ప్రారంభ ధర వచ్చేసి రూ. 31.9 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 40.77 లక్షలు ఉంటుంది.కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త 2022 గ్లోస్టర్ డిజైన్, ఫీచర్స్ ఇంకా ఇంజిన్ పర్ఫామెన్స్ వంటి వివరాలు తెలుసుకుందాం.భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 గ్లోస్టర్ SUV 6 సీటర్ మరియు 7 సీటర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. 7 సీటర్ అనేది సూపర్, షార్ప్ మరియు శావీ అనే మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. అయితే 6 సీటర్ వేరియంట్ విషయానికి వస్తే ఇది కేవలం ఒకే ఆప్సన్ లో అందుబాటులో ఉంటుంది.2022 ఎంజి గ్లోస్టర్ అప్డేటెడ్ డిజైన్ తో వస్తుంది. ఇందులో ఇప్పుడు డ్యూయల్-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. అయితే ఇప్పుడు ఇది డీప్ గోల్డెన్ కలర్ అనే కొత్త కలర్ ఆప్సన్ లో లభిస్తుంది. ఇహి కాకుండా మెటల్ బ్లాక్, మెటల్ యాష్ ఇంకా వార్మ్ వైట్ అనే కలర్ ఆప్షన్‌లలో కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.


ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 టెర్రైన్ మోడ్‌లు, డ్యూయల్ పనోరమిక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 12-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, డ్రైవర్ సీట్ మసాజ్, వెంటిలేషన్ ఫీచర్ ఇంకా వైర్‌లెస్ ఛార్జింగ్ వంటివి అందుబాటులో ఉన్నాయి.కొత్త గ్లోస్టర్ SUV లో కొత్త i-SMART ఫీచర్ ఉంది. దీనితోపాటు 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ ఇప్పుడు ఇందులో 100 బేసి వాయిస్ కమాండ్‌లతో పాటు 35 కి పైగా హింగ్లీష్ వాయిస్ కమాండ్‌లను కూడా పరిచయం చేసింది.రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ ఇంకా డోర్ ఓపెన్ వార్నింగ్ ఉన్నాయి, ఇవన్నీ సెగ్మెంట్-ఫస్ట్ గా ఉంటాయి. మ్యాప్ మై ఇండియా నుండి అప్‌గ్రేడ్ చేయబడిన నావిగేషన్ ప్యాకేజీ మరొక ఆసక్తికరమైన కొత్త ఫీచర్ ఇందులో ఉంది. గ్లోస్టర్  కొత్త 'డిస్కవర్ యాప్' రెస్టారెంట్‌లు, హోటల్స్ మొదలైన వాటిని గుర్తించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 212 హెచ్‌పి పవర్ అందిస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ యాడ్ చేయబడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: