బైక్‌ : వాష్‌ చేసేప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

Purushottham Vinay
అబ్బాయిలకు ఒక ఏజ్‌ రాగానే..వారికి ఫస్ట్‌ బైక్‌ అనేది ఉండాలనిపిస్తుంది. ఆ బైక్ కోసం ఇంట్లో వారు చిన్నపాటి యుద్దమే చేస్తారు. అలాగే కొంతమంది ఇంట్లో వాళ్లు ఇచ్చిన డబ్బులతో బైక్‌ తీసుకుంటే..మరికొంతమంది మాత్రం బైక్ ని ఫైనాన్స్‌లో కొంటుంటారు.ఇక మొత్తానికి ఎలా అయితే.. బైక్‌ వారికి ఎప్పుడూ కూడా నిత్యవసరం అయిపోతుంది. కొత్తమోజులో ఇక తమ బైక్‌ను వారు ఎప్పుడూ కూడా మల్లెపువ్వులా జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే ఎంత జాగ్రత్తగా వాడినా కూడా ఒక్కసారి బైక్‌ రోడ్డెక్కింది అంటే.. ఎక్కడ లేని దుమ్ము అంతా కూడా పడుతుంది.ఇక నెలకు ఒకసారి అయినా సరే బైక్‌ను సర్వీసింగ్‌కు ఇస్తారు. కొంతమంది బయట సర్వీసింగ్‌ సెంటర్లో బైక్‌ కనుక క్లీన్‌ చేయిస్తే.. మరికొంతమంది మాత్రం ఇంట్లోనే క్లీన్‌ చేస్తారు. అలాగే సర్వీస్‌ సెంటర్లో వాళ్లకు అయితే అన్నీ తెలుస్తాయ్‌ కాబట్టి జాగ్రత్తగానే వాటిని క్లీన్‌ చేస్తారు.. కానీ ఇంట్లో బైక్‌ వాష్‌ చేసేప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.. ఇక అవేంటో చూద్దామా..!


ఇక బైక్‌ని కడిగిన ప్రతి సారి కూడా ఎగ్జాస్ట్ పైప్‌లో ఉండే సైలెన్సర్‌లోకి నీళ్లు వెళ్లకుండా ఖచ్చితంగా చూడాలి. అలాగే నీరు లోపలకి పోతే.. బైక్‌ని స్టార్ట్ చేయడం కష్టం. ఎక్కువ సార్లు కిక్ ని ఇవ్వాల్సి వస్తుంది.
అలాగే కీ-లాక్ లోకి కూడా వాటర్ వెళ్ళకూడదు. అక్కడకి కనుక వాటర్ పోతే.. బైక్ ని లాక్ చేయడం ఇంకా అలాగే అన్ లాక్ చేయడం కష్టం. కొన్ని సార్లు అది పూర్తిగా చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలా చెయ్యకూడదు. ఇక ఒక వేళ పొరపాటున కీ-లాక్ లోకి నీరు పోతే అది ఆరిపోయే వరకు చాలా ఇబ్బంది అవుతుంది. కీ-లాక్‌లో కొంచం నూనె వేయడం ద్వారా తిరిగి లాక్ చేయడం- అన్ లాక్ చేయడం కూడా చేయవచ్చు.అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బైక్ ను వాష్ చేసేటప్పుడు ఖచ్చితంగా నీరు ఫ్యూయల్ ట్యాంక్‌లోకి వెళ్లకుండా చూసుకోండి. ఎందుకంటే.. ఫ్యూయల్ ట్యాంక్ లోకి వాటర్ కనుక వెళ్తే ఆ వాటర్ పెట్రోల్‌తో కలిసి పెట్రోల్ సామర్ధ్యం కూడా తగ్గుతుంది. వాటర్ కలిసిన పెట్రోల్‌ను ఇంజిన్ అసలు తీసుకోదు. దీనితో బైక్ స్టార్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ స్టార్ట్ అయినా కూడా బైక్ సరిగా నడవదు.కాబట్టి మీ బైక్‌ను వాష్‌ చేసేప్పుడు ఈ చిన్నపాటి జాగ్రత్తలు తప్పక పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: