భారీగా పెరగనున్న వాహనాల థర్డ్ పార్టీ బీమా ఖరీదు!

Purushottham Vinay
ఇక వచ్చే నెల అంటే జూన్ 1 వ తేదీ నుంచి ద్విచక్ర ఇంకా అలాగే నాలుగు చక్రాల వాహనాలతోపాటు ఇతర భారీ వాహనాల థర్డ్ పార్టీ బీమా కూడా ఖరీదు కానుంది. అంటే, ప్రస్తుతం మీరు థర్డ్ పార్టీ బీమా కోసం ఎక్కువ ప్రీమియంని చెల్లించాల్సి ఉంటుంది.అలాగే మోటారు వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను కూడా పెంచేందుకు ఇన్సూరెన్స్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ముసాయిదాను రెడీ చేసింది. కొత్త రేట్లు జూన్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇక నాలుగు చక్రాల వాహనాలకు ప్రతిపాదిత సవరించిన ధరల ప్రకారం 1,000 సీసీ ప్రైవేట్ కార్లకు రూ. 2,072లకు బదులుగా రూ. 2,094లకు దాకా వర్తిస్తుంది. అలాగే అదేవిధంగా, 1,000 సీసీ నుంచి 1,500 సీసీ దాకా ఉన్న ప్రైవేట్ కార్లు రూ.3,221లకు బదులుగా రూ.3,416ల వరకు ఉండనుంది. అయితే ఇక్కడ 1,500 సీసీ కంటే ఎక్కువ ఉన్న కార్ల యజమానులు రూ. 7,890లకు బదులుగా రూ. 7,897ల ప్రీమియంని వారు చెల్లించాలి.


అలాగే ద్విచక్రవాహనాల విషయానికొస్తే, 150 సీసీ నుంచి 350 సీసీ మధ్య వాహనాలకు ప్రీమియం రూ. 1,366 ఇంకా అలాగే 350 సీసీ కంటే ఎక్కువ ఉన్న వాహనాలకు ప్రీమియం రూ. 2,804గా ఉండనుంది.ఇక అలాగే ఎలక్ట్రిక్ వాహానాల విషయానికి వస్తే.. ప్రీమియం 30 kW దాకా కొత్త ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) కోసం మూడు సంవత్సరాల సింగిల్ ప్రీమియం అనేవి రూ. 5,543. 30 లు ఉండనుంది.అలాగే 65 కిలోవాట్లు ఎక్కువ సామర్థ్యం ఉన్న ఈవీలకు రూ.9,044గా ఉండనుంది. భారీ EVల కోసం మూడేళ్ల ప్రీమియం వచ్చేసి రూ. 20,907గా ఉండనుంది.3 kW దాకా కొత్త ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలకు ఐదు సంవత్సరాల సింగిల్ ప్రీమియం రూ. 2,466గా పేర్కొన్నారు.ఇక అదేవిధంగా, 3 నుంచి 7 కిలోవాట్ల దాకా ద్విచక్ర EV వాహనాలకు ప్రీమియం రూ. 3,273లుకాగా, 7 నుంచి 16 kW వాహనాలకు ప్రీమియం రూ. 6,260గా ఉండనుంది.చాలా ఎక్కువ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల ప్రీమియం రూ.12,849గా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: