అథ్లెట్ "అశ్వని నాచప్ప" ఇప్పుడు ఏమి చేస్తోందో తెలుసా?

VAMSI
అశ్వని నాచప్ప ఈ పేరు వినగానే స్పోర్ట్స్ మరియు కెమెరా రెండు గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఈమె ఒక సూపర్ స్పోర్ట్స్ పర్సనాలిటీ మాత్రమే కాదు గొప్ప యాక్టర్ కూడా అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అంతకు మించిన సోషల్ యాక్టివిస్ట్ కూడా కావడం గమనార్హం. ఎనభైల నాటి కాలంలో అథ్లెటిక్స్ లో టాప్ రన్నర్ గా ఉన్న పిటి ఉషను సైతం ఓడించి ఒక్క సారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు. అశ్వని నాచప్ప నిజ జీవిత చరిత్రను తెరకెక్కించారు. అందులో ఈమె తన పాత్రను తాను పోషించి మెప్పించింది. ఆ తరువాత కొన్ని సినిమాలు కూడా చేశారు. అనంతరం సినిమాలకి కూడా దూరం అయ్యారు.
అథ్లెటిక్ గా రిటైర్డ్ అయ్యాక భర్త కరోభయ్య నెలకొల్పిన స్పోర్ట్స్ అకాడమీని చూసుకుంటున్నారు.  ఈమెకు అనీషా, దీపాలి అనే ఇద్దరు కుమార్తెలు. వీరు కూడా తల్లి లాగే స్పోర్ట్స్ రంగంలో దూసుకు పోతున్నారు. పెద్దమ్మాయి అనీషా మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్, రెండో అమ్మాయి దీపాలి గోల్ఫ్ ప్లేయర్. అశ్వని నాచప్ప ఒక ఆదర్శ మహిళ. దేశ వ్యాప్తంగా ఆడపిల్లలపై ఉన్నటువంటి చిన్న చూపును రూపు మాపి మహిళలకు పురుషులతో సమాన గౌరవం హోదా దక్కాలని పాటుపడే వ్యక్తి.
తానే కాదు తన కుమార్తెలను అలాగే మరి కొందరు ఆడ పిల్లలకు కూడా శిక్షణ ఇస్తూ ఆడపిల్లలు కూడా అన్ని రంగాలలో ముందుండాలని ఎందు లోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఆడ పిల్లలు కూడా బాగా చదువుకోవాలి అలాగే ఆటల్లోనూ ఎప్పుడూ ముందుండాలని అంటుంటారు అశ్వని నాచప్ప. ఇప్పటికీ ఈమెకు సినిమా ఛాన్సులు, సీరియల్ ఆఫర్లు వస్తున్నాయి అని సమాచారం. కానీ అశ్వని గారు మాత్రం పాత్ర పది మందికి ఉపయోగపడేలా ఉంటే తప్ప అస్సలు ఒప్పుకోవడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: