విజయ్ దేవరకొండకు క్రికెట్ అంటే అంత పిచ్చా?

VAMSI
మామూలుగా లైఫ్ లో ఎన్నో విషయాలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. కొన్ని మనకు తెలిసి ఒక ప్లానింగ్ ప్రకారం జరగవచ్చు, మరికొన్ని మన ప్రమేయం లేకుండానే పరిస్థితుల ప్రభావం వలన జరగవచ్చు. పుట్టిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం లేదా కోరిక ఉంటుంది. అయితే కొందరు మాత్రమే తమ కోరికను తీర్చుకోగలుగుతారు. అదే విధంగా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో విజయ్ దేవరకొండ కు కూడా ఒక కోరిక ఉండేదట. చిన్న వయసు నుండి క్రికెటర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు అని తెలుస్తోంది. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తనకు తెలియకుండానే సినీ నటుడు గా మారిపోయాడు రౌడీ హీరో.
పెళ్ళిచూపులు లాంటి చిన్న సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ .. ఆ తర్వాత వరుస హిట్ లను సాధించి కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమా తనకు భారీ ఫాలోయింగ్ వచ్చేలా చేసింది.. ఇందులో విజయ్ యాటిట్యూడ్ కు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా తనకు మంచి డిమాండ్ ను ఈ సినిమా తెచ్చి పెట్టింది. కాగా ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోలలో ఒకరుగా విజయ్ దేవరకొండ ఉన్నాడు. అయితే ప్రస్తుతం సినిమాల పరంగా చూసుకుంటే విజయ్ కు వెంటనే ఒక మంచి హిట్ అవసరం. అయితే గత కొద్దీ రోజులుగా విజయ్ అలవాట్లు చూస్తుంటే ఒక విషయం ప్రేక్షకులకు డౌట్ వస్తోంది.
అదేమిటో తెలుసా.. ఈ మధ్య తన పాన్ ఇండియా మూవీ లైగర్ విడుదలై ప్లాప్ అయింది. అయితే ఆ సమయంలోనూ విజయ్ యూఏఈ లో జరుగుతున్న ఆసియా కప్ లో ఇండియా మ్యాచ్ ను చూడడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లోనూ విజయ్ తళుక్కుమన్నాడు. ఇదంతా ఆరాతీస్తే తనకు క్రికెట్ అంటే చాలా పిచ్చి అని తెలుస్తోంది. విజయ్ కు క్రికెట్ మీద ఉన్న ఇష్టం గురించి తెలియాలి అంటే... తన సినిమా ఏది హిట్ అయినా కూడా తన ఇంటి దగ్గర ఉన్న చిన్న పిల్లల్ని గుంపుగా చేసుకుని క్రికెట్ ఆడడం చాలా సరదా అని ఎన్నో సార్లు ఇంటర్వ్యూ లలో విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ క్రికెట్ పై అంత ప్రేమ ఉన్న విజయ్ మాత్రం క్రికెటర్ కాలేక సినీ నటుడిగా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: