ప్ర‌భాస్ త‌న మొద‌టి సినిమా ఎలా ఓకే అయిందో తెలుసా?

Dabbeda Mohan Babu
ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భాస్ త‌న మొద‌టి సినిమా చేయ‌డానికి చాలా కష్ట ప‌డ్డాడు. ప్ర‌భాస్ మొద‌టి సినిమా ఈశ్వ‌ర్ అని తెలిసిందే. అయితే ఈ సినిమా చేయ‌డానికి ముందు సినిమా ఇండస్ట్రీ కి రావాల‌ని అనుకోలేద‌ట‌. చ‌దువు దానికి త‌గ్గ ఉద్యోగం లేదా మంచి వ్యాపారం చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. అయితే ప్ర‌భాస్ వాళ్ల స్నేహితులు హీరో అని త‌రుచూ పిలిచే వారట‌. దీంతో త‌న‌కు హీరో కావాల‌ని అనిపించింద‌ట‌. దీంతో ప్ర‌భాస్ త‌ను హీరోగా న‌టించాల‌నే కోరిక త‌న పెద్ద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజ్ కు చెప్పాడ‌ట‌. దీంతో ప్ర‌భాస్ కు న‌ట‌న లో శిక్ష‌ణ ఇప్పించాల‌ని కృష్ణం రాజ్ నిర్ణ‌యం తీసుకున్నాడు.

దీంతో విశాఖ ప‌ట్నంలో ఉన్న స‌త్యానంద్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌ర‌కు న‌ట‌న లో శిక్ష‌ణ తీసుకోవ‌డానికి ప్ర‌భాస్ ను పంపించారు. దీంతో విశాఖ లోని స‌త్యానంద్ వ‌ద్ద చాలా రోజులు శిక్ష‌ణ తీసుకున్నారు. అయితే ప్ర‌భాస్ శిక్ష‌ణ పూర్తి కాక ముందే అశోక్ కుమార్ అనే నిర్మాత నుంచి ప్ర‌భాస్ కు అవ‌కాశం వ‌చ్చింది. అయితే ప్ర‌భాస్ అప్పుడు సినిమా చేయ‌డానికి ఒప్పు కోలేద‌ట‌. అయితే రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజ్ ప్ర‌భాస్ కు న‌చ్చ చెప్ప‌టంతో ఓకే అన్నాడు. ఆ సినిమా ను ఈశ్వ‌ర్ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

అయితే ప్ర‌భాస్ త‌న పెద్ద‌నాన్న రెబల్ స్టార్ స‌పొర్ట్ తో సినిమా రంగంలోకి వ‌చ్చినా.. త‌న తొలి సినిమా ఈశ్వ‌ర్ లో అద్భుత మైన న‌ట‌న తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టు కున్నాడు. ఈ సినిమా తో  మాస్ క్లాస్ ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పించాడు. అయితే ఈ సినిమా స‌మ‌యంలో జ‌యంత్ సీ. ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే స‌మ‌యంలో మానిట‌ర్ లేకుండ‌నే చేశాడు. దీంతో ప్ర‌భాస్ త‌న మొద‌టి సినిమా ఎలా వ‌చ్చిందో తెలిసేదే కాదు. డైరెక్ట్ గా థీయేట‌ర్ లో నే చూసాడ‌ట‌. అయితే త‌న న‌ట‌న చూసి త‌న నాన్న‌, పెద్ద నాన్న మెచ్చుకున్నారట‌.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: