ప్ర‌భాస్ కు ఇంత సిగ్గా? ముద్దు సీన్ కోసం తండ్రి ప‌ర్మిష‌న్

Dabbeda Mohan Babu
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ కు సిగ్గు కాస్త ఎక్కువ గానే ఉంటుంది. అయితే సిగ్గు అనేది ప్ర‌భాస్ కు చిన్న‌ప్ప‌టి నుంచే ఉండేద‌ట‌. త‌న‌కు తెలిసిన వాళ్ల ముందు మాములు గానే ఉంటాడు. కానీ ఎక్కువ మంది ఉన్న స‌మ‌యాల్లో ప్ర‌భాస్ సిగ్గు తో క‌నీసం మాట్లడం కూడా క‌ష్టంగానే ఉంటుంది. గ‌తంలో బ‌హుబ‌లి ప్ర‌మోష‌న్స్ కోసం హింది రాష్ట్రాల‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌భాస్ చాలా సిగ్గు ప‌డ్డాడు. దీంతో హింది రిపొర్ట‌ర్లు ప్ర‌భాస్ ను ఆడుకున్నారు. ప్ర‌భాస్ ఇండ‌స్ట్రీ కి వ‌చ్చి ఇన్ని రోజులు అవుతున్న సిగ్గు ఏ మాత్రం తగ్గ‌లేదు. అయితే ప్ర‌భాస్ ఇండ‌స్ట్రీ కి వ‌చ్చిన మొద‌ట్లో ఇంకా చాలా సిగ్గు ఉండేద‌ట‌. ఒక సినిమా కు సంబంధించి ముద్దు సీన్ లో ఎకంగా త‌న తండ్రి ప‌ర్మిష‌న్ తీసుకున్నాడ‌ట‌.

ఈ విష‌యం స్వ‌యంగా ప్ర‌భాస్ మేన‌జ‌ర్ ప్ర‌భాస్ శ్రీను చెప్పాడు. ప్ర‌భాస్ శ్రీ‌ను హీరో ప్ర‌భాస్ కు మంచి స్నేహితుడిగాను ఉంటాడు. అలాగే ప్ర‌భాస్ శ్రీ‌ను  అనేక సినిమాల్లో క‌మెడీయ‌న్ గా కూడా న‌టించారు. 17 సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన సంఘ‌ట‌న ను గుర్తు చేసుకుని వివ‌రించాడు. ప్ర‌భాస్, ఆర్తి అగ‌ర్వాల్ హీరో హీరోయిన్ గా న‌టించిన సినిమా అడ‌వి రాముడు. అయితే ఈ సినిమాలో ప్ర‌భాస్ హీరోయిన్ ఆర్తి అగ‌ర్వాల్ తో ఒక రొమాంటిక్ సీన్ లో న‌టించాల్సి వ‌చ్చింద‌ట‌. అందులో ఒక ముద్దు సీన్ కూడా ఉంద‌ట‌. అయితే ఈ ముద్దు సీన్ కోసం ప్ర‌భాస్ త‌న తండ్రి అనుమ‌తి కోసం ఫోన్ చేశాడ‌ట‌. హీరోయిన్ కు ముద్దు పెట్టు మంటున్నారు. పెట్టాలా .. నాన్న అని ఫోన్ లో అడిగాడ‌ట‌. ఇది తెలిసిన చిత్రం యూనిట్, అభిమానులు ఆశ్చ‌ర్య పొయార‌ట‌. మ‌రి ఇంత‌లా సిగ్గు ఉంటే ఎలా అని ప్ర‌భాస్ ను అడిగారు. అయితే ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినా.. త‌న లో ఉన్న సిగ్గు మాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: